హైదరాబాద్: పంచతత్వ పార్కు ఓపెన్ -ఆక్యూప్రెజర్ ట్రాక్ -ప్రత్యేకతలివే -మంత్రి కేటీఆర్ సందడి
రెండేళ్ల కిందటి 'మోదీ ఫిట్ నెస్' వీడియో గుర్తుందా? ప్రధాని అధికారిక నివాసంలో.. ఓ చెట్టు చుట్టూరా.. ఇసుక, గుళకరాళ్లు, చెక్కపొట్టు తదితరాలతో రూపొందిన ట్రాక్ పై మోదీ నడవటం చూశాం కదా.. సరిగ్గా అలాంటి వాకింగ్ ట్రాకే ఇప్పుడు హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సిటీలో పంచతత్వ పార్కును ప్రారంభించారు.
Recommended Video
ప్రఖ్యాత ఇందిరాపార్కులోని ఒక భాగంలో నిర్మించిన పంచతత్వ పార్కును మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు.ఈ పార్కులో ఎనిమిది అంశాలతో ఒక ఎకరం విస్తీర్ణంలో ఆక్యూప్రెజర్ (శరీరంపై ఒత్తిడి కలిగించు)వాకింగ్ ట్రాక్ ను నిర్మించారు.
Ministers @KTRTRS, and @VSrinivasGoud inaugurated Panchatatva Park in the premises of Indira Park in Hyderabad. Mayor @bonthurammohan and MLA @MutaGopal were present. pic.twitter.com/3n48WhERRy
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 15, 2020
ఎకరం విస్తీర్ణంలో సర్కిల్ పద్ధతిలో నిర్మించిన ఆక్యుప్రెజర్ ట్రాక్‌పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపై వివిధ స్థాయిలో ఒత్తిడిని కలిగించేలా 20 ఎం.ఎం, 10 ఎం.ఎం రాళ్లు, రివర్ స్టోన్స్, 6 ఎం.ఎం చిప్స్, ఇసుక, చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్‌లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింట్ ట్రాక్‌ను నిర్మించారు. దీంతో రక్తప్రసరణలో సానుకూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

పంచతవ్వ పార్క్ లోని వాకింగ్ ట్రాక్ సర్కిల్‌కు అన్ని వైపులా 40 రకాల మెడిసినల్, హెర్బల్ మొక్కలను బ్లాక్‌లుగా ఏర్పాటు చేశారు. పార్కు మధ్యలో గౌతమ బుద్దుడి విగ్రహాన్ని కూడా నెలకోల్పారు. ఆరోగ్యం పట్ల నగరవాసుల్లో ఆసక్తిని, అవగాహన పెంచేందుకు ఇదెంతో ఉపయోగపడుతుందని, హైదరాబాద్‌లోని అన్ని జోన్లలో పంచతత్వ పార్కులను అభివృద్ధి చేస్తామని నేతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ రాకతో ఇందిరాపార్క్ లో సందడివాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications