2014 చెప్పాం.. ఇప్పుడు చేసి చూపించాం: ఐటీలో హైదరాబాద్ దూసుకెళ్తోందంటూ కేటీఆర్

హైదరాబాద్: ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని.. ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామన్నారు. టీ-హబ్‌లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2013-14లో హైద‌రాబాద్‌లో ఐటీ ఉత్ప‌త్తులు రూ. 56 వేలు కోట్లు ఉంటే.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఒక ల‌క్ష 83 వేల కోట్ల ఐటీ ఎగుమ‌తుల‌కు చేరుకున్నామ‌ని తెలిపారు.

రాష్ట్రం ఏర్ప‌డిన సమయంలో ఐటీ సెక్టార్‌లో 3 ల‌క్ష‌ల 20 వేల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 7 ల‌క్ష‌ల‌కు పైచిలుకు ఉద్యోగాలు క‌ల్పించామ‌న్నారు కేటీఆర్. అప్పుడు చెప్పిన విధంగానే ఐటీ రంగంలో బెంగ‌ళూరుతో పోటీ ప‌డేలా హైద‌రాబాద్‌ను నిల‌బెట్టామ‌ని చెప్పారు. క‌రోనా వ‌చ్చాక ఐటీ రంగంపై అనేక అపోహాలు వ‌చ్చాయి. ఐటీ రంగంలో కేంద్రం నుంచి స‌హ‌కారం ఏమీ లేదు. మాట సాయం త‌ప్ప కేంద్రం ఎలాంటి అండ‌దండ‌లు అందించ‌లేదు. యూపీఏ ప్ర‌భుత్వం తెలంగాణ‌కు కేటాయిచిన ఐటీఐఆర్‌ను కూడా ప్ర‌స్తుత కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. అయిన‌ప్ప‌టికీ నిల‌దొక్కుకుని ఐటీ రంగాన్ని అగ్రభాగానా నిల‌బెట్టామ‌ని కేటీఆర్ వివరించారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ ఐటీ రంగ వృద్ధిలో అన్ని సూచీల్లో.. జాతీయ సగటును దాటుకుని వేగంగా ముందుకెళ్తోందన్నారు.

 minister ktr

హైదరాబాద్ నగరాన్ని ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇటీవల అమెరికా పర్యటనతో పెద్ద ఎత్తు పెట్టుబడులు వచ్చాయన్నారు. వాషింగ్ట‌న్‌లో అనేక మంది పారిశ్రామిక‌వేత్త‌ల‌తో స‌మావేశమైనట్లు తెలిపారు. బెల్లంప‌ల్లిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు రెండు వాషింగ్ట‌న్ సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయని తెలిపారు. అనేక అమెరికా కంపెనీలు హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నాయ‌ని కేటీఆర్ తెలిపారు. అమెరికాకు చెందిన క్వాల్‌కామ్ హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెడుతోంది. గూగుల్ కూడా హైద‌రాబాద్‌లో అతిపెద్ద కేంద్రం నిర్మిస్తోంది. భార‌త్ కంపెనీ ఎల్‌టీఐ మైండ్ ట్రీ కంపెనీ వ‌రంగ‌ల్‌లో పెట్టుబ‌డులు పెడుతోంది. గ్రిడ్ డైన‌మిక్స్ హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెడుతోంది. సైబ‌ర్ నేరాలు అరిక‌ట్టేందుకు సైబ‌ర్ క్రైమ్ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ తెస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

అంతేగాక, హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు జ‌ర్మ‌నీ కంపెనీ బాష్ ముందుకొచ్చింద‌ని కేటీఆర్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంట‌ర్ హైద‌రాబాద్‌కు వ‌స్తోంది. లండ‌న్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ కేంద్రం ఈ ఏడాది వ‌స్తుంది. మ‌రో రెండేళ్ల‌లో డ‌జోన్ ప్రొడ‌క్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ వ‌స్తోంది. అమెరికాకు చెందిన వార్న‌ర్ బ్ర‌దర్స్ డిస్క‌వ‌రీ హైద‌రాబాద్‌లో ఐడీసీ నిర్మిస్తోంది. అమెరికాకు చెందిన జాప్‌కామ్ సెంట‌ర్ కూడా హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెడుతోంది. టెక్నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ సెంట‌ర్ కూడా వ‌స్తోందని వివరించారు కేటీఆర్.

వ‌రంగ‌ల్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, సిద్దిపేట‌, సిరిసిల్ల వంటి ప‌ట్ట‌ణాల‌కు కొత్త సంస్థ‌లు వ‌స్తున్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. వ‌రంగ‌ల్‌కు టెక్ మ‌హీంద్రా, జెన్‌ప్యాక్ వంటి సంస్థ‌లు వ‌స్తున్నాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోనూ కొన్ని సంస్థ‌లు త‌మ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. న‌ల్ల‌గొండ వంటి టైర్ 2 ప‌ట్ట‌ణాల‌కు ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయి. ఫాక్స్‌కాన్ సంస్థ ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చింది. త్వ‌ర‌లోనే ఈ మొబిలిటీ వీక్ నిర్వ‌హించ‌బోతున్నాం. టీ వ‌ర్క్స్ సంస్థ‌కు ఇటీవ‌లే కేంద్రం అవార్డు ఇచ్చింది. టీ వ‌ర్క్స్ స్ఫూర్తితో మ‌హారాష్ట్ర ఎం వ‌ర్క్స్ ఏర్పాటు చేయ‌బోతుందని కేటీఆర్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+