కేటీఆర్ కు కరోనా పాజిటివ్ .. స్వయంగా వెల్లడించిన తెలంగాణా మంత్రి

తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు , ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లుగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించిన కేటీఆర్ ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు .

అంతేకాదు అందరూ జాగ్రత్తగా ఉండాలని, తనను కలిసిన వారు హోమ్ క్వారంటైన్ అవ్వాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే . ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన ఫాంహౌస్ లో కరోనా చికిత్స పొందుతున్నారు. ఇటీవల యశోద ఆసుపత్రిలో ఆరు రకాల పరీక్షలు చేయించుకున్న కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు .

Minister KTR tested corona positive , Now in home isolation

ప్రస్తుతం కేటీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి అద్దం పడుతుంది . ఏ ఒక్కరినీ వదలకుండా మహమ్మారి పంజా విసురుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది . పురపాలక శాఖ మంత్రి కరోనా బారిన పడిన సమయంలో,తెలంగాణ రాష్ట్రంలో ఐదు మున్సిపాలిటీలకు, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+