Hyderabad: స్టీల్ వంతెన ప్రారంభ తేదీ ఖరారు: బ్రిడ్జీకి కార్మిక నేత పేరు

హైదరాబాద్: హైదరాబాద్‌ నగరంలో మరో వంతెన అందుబాటులోకి రానుంది. ఇందిరాపార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని వీఎస్టీ వరకు నిర్మించిన ఉక్కు వంతెన(స్టీల్ ఫ్లైఓవర్) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. శనివారం అంటే ఆగస్టు 19న ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడం సంతోషంగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. వంతెనకు సంబంధించిన పలు ఫొటోలను పంచుకున్నారు. రూ. 450 కోట్ల వ్యయంతో 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(ఎస్ఆర్డీపీ) కింద జీహెచ్ఎంసీ నిర్మించిందని తెలిపారు.

minister ktr to inaugurate steel flyover in hyderabad on august 19th

ఈ వంతెనకు కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాయిని.. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అలాగే, చాలా కాలం పాటు వీఎస్టీ కార్మికుల సంఘానికి నాయిని సారథ్యం వహించారని మంత్రి కేటీఆర్ వివరించారు.

ఈ వంతెన అందుబాటులోకి రావడంతో వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ మార్గంలో జనావాసాలతో పాటు వాణిజ్య సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, హాస్టల్స్‌, కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుండడంతో వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు. సమస్య నుంచి గట్టెక్కించేందుకు జీహెచ్‌ఎంసీ స్టీల్‌ వంతెన నిర్మించాలని నిర్ణయించింది. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణంతో వాహనదారుల కష్టాలకు తెరపడనుంది.

లింగంపల్లి జంక్షన్, అశోక్‌నగర్‌ క్రాస్ రోడ్ వద్ద సైతం ట్రాఫిక్‌ కొంత తగ్గనుందని భావిస్తున్నారు. వంతెనపై ఎల్‌ఈడీ లైట్లు, క్రాస్ బారియర్ల ఏర్పాటు చేశారు. ఈ వంతెనపై గంటకు 40 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంది.కాగా, దక్షిణ భారతదేశంలో రహదారిపై నిర్మించిన మొదటి పొడవైన ఉక్కువ వంతెన ఇదే కావడం గమనార్హం. జీహెచ్ఎంసీ చరిత్రలో భూసేకరణ లేకుండా నిర్మాణం పూర్తయిన బ్రిడ్జి ఇది. హైదరాబాద్‌లోని మెట్రో రైలు మార్గంపై నిర్మాణమైన తొలి వంతెన కూడా ఇదే కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+