మరదలు కామెంట్స్ రచ్చ: మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ.. అలా అనలేదు
మరదలు మంగళవారం దీక్ష కామెంట్ల దుమారం చెలరేగింది. షర్మిలను ఉద్దేశించి మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్ చేశారు. దీనిపై షర్మిల ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఏం జరిగిందో మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాజకీయ పక్షం ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతుండడం తెలిసిందే. మంత్రి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ మంగళవారం మరదలు బయలుదేరింది అంటూ వ్యాఖ్యానించగా, తీవ్ర విమర్శలు వచ్చాయి.
తన వ్యాఖ్యల పట్ల నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా నొచ్చుకుని ఉంటే, అందుకు పశ్చాత్తాప పడుతున్నానని వెల్లడించారు. అయినా తాను ఎవరి పేరును ఉపయోగించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను మరోసారి గమనించాలని సూచించారు. "మంగళవారం మరదలమ్మా" అంటూ చివరన అమ్మా అని మర్యాద ఇచ్చానని స్పష్టం చేశారు. సంస్కారం ఉన్న వారికి తన మాటలు సంస్కారవంతంగానే ఉంటాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ షర్మిల తన తండ్రి సమకాలికుడైన కేసీఆర్‌ను ఏకవచనంతో సంబోధిస్తుండడం సరైన పద్ధతేనా? అని ప్రశ్నించారు.

మరోవైపు వైఎస్ షర్మిల స్వరం పెంచారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని ఏకిపారేశారు. ఏకంగా శునకం అనేశారు. సభ్యత, సంస్కారం లేదా అంటూ ఫైరయ్యారు. తనను మరదలు అనడంపై ఓ రేంజ్‌లో ఫైరయిన.. షర్మిల.. మరి కవిత ఏమవుతుందని అడిగారు. ప్రతిపక్ష/ ఇతర పార్టీల నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. ఈ కుక్కకి కవిత ఏం అవుతుందో సమాధానం చెప్పాలని షర్మిల నిలదీశారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతాయని ఆమె తెలిపారు. సంస్కారం లేని కుక్కలు టీఆర్‌ఎస్‌లో ఉన్నాయని ఫైరయ్యారు. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడకు పోతుందని ఆమె అన్నారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరిందని షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. షర్మిల పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
Recommended Video
నిరంజన్ రెడ్డి బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పందించారు. ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని మంత్రి ఆరోపించారు.ఇటీవల షర్మిల పలు సందర్భాల్లో షర్మిల మాట్లాడారు. వైఎస్ఆర్ పాలనలో నిరుద్యోగులు, విద్యార్థులు క్షేమంగా ఉన్నారని షర్మిల అన్నారు. ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోలేదని చెప్పారు. ఐదేళ్లలో మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి, లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పారు. 2008లో జంబో డీఎస్సీతో 54 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన మహనీయుడు వైయస్ఆర్ అని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలోనూ 11లక్షల ఉద్యోగాలు సృష్టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా పేదలకు లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి కల్పించారు. పేదవాడికి జబ్బు చేస్తే ఆ కుటుంబం మొత్తం అప్పుల పాలవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకే పేద వాడి ఇంటి ముందు అంబులెన్స్ వచ్చేలా చేసిన గొప్ప నాయకుడు మన వైఎస్ఆర్ అని చెప్పారు.












Click it and Unblock the Notifications