హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పువ్వాడను బర్తరఫ్ చేయండి.. లేదంటే మీకే నష్టం, సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి సజెషన్

|
Google Oneindia TeluguNews

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త గణేశ్ సూసైడ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే బండి సంజయ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లక్ష్యంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వేధించేవాడని గుర్తుచేశారు. మూడేళ్ల నుంచి తమ పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం అని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా..

కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా..


మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలపై అనేక కేసులే కాక పీడీ యాక్ట్‌ పెట్టి వేధిస్తున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. దీనిపై గతంలో డీజీపీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని జగ్గారెడ్డి అన్నారు. పువ్వాడ ఓ సైకో అని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్ద మార్కులు కొట్టేయడానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని విమర్శించారు. తాన అంటే తందాన అనేందుకు మంత్రి పువ్వాడకు కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శలు చేశారు.

ఎస్పీ సార్.. ఏం చేస్తున్నారు..

ఎస్పీ సార్.. ఏం చేస్తున్నారు..

జిల్లాలో ఇంత జరుగుతున్నా ఎస్పీ ఏం చేస్తున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పోలీసులపై విశ్వాసం పోకుండా చూడాలని కోరారు. మృతుడి కుటుంబాల నుంచి పోలీసులు ఎందుకు వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. వాంగ్మూలం తహసీల్దార్, పోలీస్ అధికారులు తీసుకోవాలని, కానీ మీడియా తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. వాంగ్మూలం తీసుకోలేదంటేనే ఇది హత్యగా అర్థం అవుతుందని జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ చేసిన హత్య అని ధ్వజమెత్తారు.

అజయ్‌పై ఉన్న ఫిర్యాదులపై విచారణ

అజయ్‌పై ఉన్న ఫిర్యాదులపై విచారణ

అజయ్‌పై ఉన్న ఫిర్యాదులపై విచారణ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే నష్టమని తెలిపారు. ఈ విషయం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిందని సూచించారు. కార్యకర్తలను వేధించడం.. చనిపోయేందుకు కారణం అవడం లాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఇలా జరుగుతుందని.. దీనికి అడ్డుకట్ట వేయాలని అభిప్రాయపడ్డారు. లేదంటే గులాబీ దళానికే ఇబ్బందులు అని.. వచ్చే ఎన్నికల్లో ప్రభావం ఉంటుందని ఇండైరెక్టుగా జగ్గారెడ్డి హెచ్చరించారు.

English summary
minister puvvada ajay kumar to sacked cabinet mla jagga reddy demanded to government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X