Numaish 2024: జనవరి 1 నుంచి నుమాయిష్ ప్రారంభం..
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈ సంవత్సరం నుమాయిష్ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 83 వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కు అంత సిద్ధమైంది. నుమాయిష్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును నియమించారు. 80 ఏళ్లుగా తెలంగాణలో జరుగుతున్న నుమాయిష్ కు దేవ్యాప్తంగా సందర్శకులు వస్తారని శ్రీధర్ బాబు చెప్పారు.
సొసైటీ సభ్యులు సేవా గుణంతో పని చేస్తున్నారని చెప్పారు. చాలా మంది నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటారని తెలిపారు. వారికి ప్రోత్సాహం సొసైటీ అందిస్తుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా జనవరి 1న నుమాయిష్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు.

ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40 గా నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గాంచిన నుమాయిష్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి15 వరకు కొనసాగనుంది. ఎగ్జిబిషన్ లో ఎలాంటి అగ్ని ప్రమాదలు జరగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు.వృద్ధులు నడవ లేని వానరికి ఎగ్జిబిషన్ లోపల ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు.
నుమాయిష్ ఎగ్జిబిషన్ ను దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ పలు డిపోల నపుంచి ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. నాంపల్లి, గాంధీభవన్ మెట్రో ష్టేషన్లు ఎగ్జిబిషన్ మైదానానికి సమీపంగా ఉన్నాయి. మియాపూర్ - ఎల్బీనగర్, నాగోల్, - రాయదుర్గం మార్గాల్లో నడిచే మెట్రో రైళ్లను నుమాయిష్ ను దృష్టిలో ఉంచుకొని అర్థరాత్రి వరకు పొడిగించే అవకాశం ఉందని తెలిస్తోంది. ప్రత్యేకంగా మెట్రో రైల్ కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు.












Click it and Unblock the Notifications