హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పుడు ప్రచారం.. బ్లాంక్ గన్‌తో కాల్చ, వరంగల్‌లో లేని అభ్యంతరం ఇక్కడే ఎందుకు: శ్రీనివాస్ గౌడ్

|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్‌లో జరిగిన ఫ్రీడం రన్, ఫ్రీడం వాక్ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై దుమారం చెలరేగింది. దీంతో మంత్రి స్పందించారు. అసలు ఏం జరిగిందో వివరించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నైతిక విలువలు పాటించాల్సింది అని పేర్కొన్నారు.

వజ్రోత్సవాల్లో పాల్గొని..

వజ్రోత్సవాల్లో పాల్గొని..


సీఎం కేసీఆర్ పిలుపు మేరకు స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రతి రోజూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఫ్రీడం రన్, ఫ్రీడం వాక్ కార్యక్రమాలు ఇందులో భాగమేనని తెలిపారు. మహబూబ్ నగర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీడం వాక్ జరిగిందని.. అందులో తుపాకీ పేల్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇదీ కరెక్ట్ కాదన్నారు. ఇష్టానుసారంగా కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ర్యాలీ జరిగినపుడు బుల్లెట్లు లేని బ్లాంక్ గన్‌తో గాల్లోకి కాల్చడం పరిపాటి అని వివరించారు.

వరంగల్‌లో సేమ్

వరంగల్‌లో సేమ్

మూడు రోజుల క్రితం కూడా వరంగల్‌లో బ్లాంక్ గన్‌తో కాల్చడం జరిగిందని గుర్తుచేశారు. బుల్లెట్లు ఉండని గన్‌తో కాలిస్తే చప్పుడే వస్తుందని.. బుల్లెట్లు ఉండవు.. కనీసం పిల్లెట్లు కూడా ఉండవన్నారు. జిల్లా ఎస్పీకి గన్ ఇచ్చే అధికారం ఉందన్నారు. తనంటే గిట్టని వారే తొలినుంచి బట్ట గాల్చి మీద వేస్తున్నారని ఫైరయ్యారు. 25 వేల మంది ర్యాలీలో పాల్గొనడం మహబూబ్ నగర్‌లో ఇదే తొలిసారి అని.. దీంతో కొందరి కళ్ళు మండుతున్నాయని వివరించారు. తాను కూడా జర్నలిజం చదివానని గుర్తుచేశారు. జర్నలిజం విలువలు తనకు తెలుసు అని చెప్పారు. క్రీడల మంత్రిగా తనకు కొన్ని అధికారాలు ఉన్నాయని తెలుసుకోవాలని సూచించారు.

మహబూబ్ నగర్‌లో వివాదం

మహబూబ్ నగర్‌లో వివాదం


వరంగల్‌లో లేని వివాదం మహబూబ్ నగర్‌లో ఎందుకు వస్తోందన్నారు. బురద జల్లే పద్ధతి రాజకీయాల్లో మంచిది కాదని కోరారు. రాజకీయాల్లో తను ఎదగడాన్ని కొందరు ఓర్చు కోలేక పోతున్నారని వివరించారు. తనకు సంబంధించి చిన్న అంశాలను కూడా గోరంతలు కొండంతలు చేస్తున్నారని గుర్తుచేశారు. తను రైఫిల్ అసోసియేషన్ సభ్యుడినని.. తుపాకులు, బుల్లెట్ల గురించి తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. వజ్రోత్సవాలు జరుగుతున్న సమయంలో మంచి హైలైట్ చేయాలి తప్ప చిన్న ఘటనల మీద కోడి గుడ్డు మీద ఈక పీకినట్టు చేయవద్దని సూచించారు.
.

English summary
telangana minister srinivas goud clarify about fire incident. this is casual fire he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X