హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2017 నుంచి చంపేందుకు కుట్ర, ఫ్యామిలీ టార్గెట్: రాఘవేంద్ర రాజు సంచలనం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యా ప్రయత్నం పెను దుమారం రేపుతోంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాఘవేంద్రరాజు స్టేట్ మెంట్‌లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. శ్రీనివాస్ గౌడ్‌తో తనకు ప్రాణ హానీ ఉందని.. అందుకే తాను చంపాలని అనుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు కాదు 2017 నుంచి తనను చంపేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేశారని వెల్లడించారు. వేధింపులు తట్టుకోలేకే శ్రీనివాస్ గౌడ్‌ను చంపాలని అనుకున్నానని తెలిపారు.

అట్రాసిటీ కేసులు..

అట్రాసిటీ కేసులు..


అంతేకాదు తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. శ్రీనివాస్ గౌడ్ తనపై 30 కేసులు పెట్టించారని, తన బార్ షాప్‌ను మూసివేయించి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఆర్థికంగా నష్టం చేయించడమే కాకుండా ఒక్కరోజే 10 కేసులు పెట్టించారని ఆరోపించారు. తనకు రూ. 6 కోట్లు నష్టం చేయించారని స్టేట్ మెంట్ లో రాఘవేంద్రరాజు వెల్లడించినట్లు సమాచారం. అదీ తట్టుకోలేక ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నారు. హత్య కోసం సుపారీ గ్యాంగ్‌ను ఆయన సంప్రదించారు.

ముగ్గురు అరెస్ట్

ముగ్గురు అరెస్ట్

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన నాగరాజు, విశ్వనాథ్, యాదయ్యను అరెస్ట్ చేశామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రకటించారు. మరో ప్రధాన నిందితుడు రఘు పరారీలో ఉన్నారని వివరించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు మధు సుధన్ రాజు, అమరేంద్ర రాజు 15 కోట్లను సుపారీ గ్యాంగ్‌కు ఆఫర్‌ చేశారని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. రాఘవేందర్‌రాజు, మున్నూరు రవితోపాటు మరో ముగ్గురు ఢిల్లీలో ఉన్నారని ట్రేస్ చేశామన్నారు.

Recommended Video

Telangana : Soil Boosters Are Also Available In Nursery Mela | Oneindia Telugu
రివాల్వర్.. 6 రౌండ్ల బుల్లెట్స్

రివాల్వర్.. 6 రౌండ్ల బుల్లెట్స్

ఢిల్లీలో గల బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి ఇంట్లో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి రివాల్వర్, మొత్తం 6 రౌండ్ల బుల్లెట్స్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు యూపీ నుంచి ఆయుధాలు సమకూర్చుకున్నారని స్టీఫెన్‌ రవీంద్ర వివరించారు. ఈ హత్య కుట్రలో జితేందర్ పాత్రపై విచారిస్తున్నామని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. డీకే అరుణ అనుచరులపై కూడా అనుమానాలు ఉన్నాయని వివరించారు. హత్య కుట్రపై శ్రీనివాస్‌గౌడ్‌కు తెలియజేశామని.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారన్నారు.

English summary
minister srinivas goud try to murder me 2017 onwards raghavendra raju alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X