ఎవరూ రేప్ చేశారు.. పేర్లు లేవా..? రాజా సింగ్ కౌంటర్ అటాక్
జూబ్లీహిల్స్ మైనర్ రేప్ ఘటన కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హోం మంత్రి మనమడికి సంబంధం ఉందనే ప్రచారం జరుగుతుంది. దానిని వారు ఖండించగా.. పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులు, ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
28వ తేదీన బాధితులు ఫిర్యాదు చేస్తే మూడు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని రాజాసింగ్ మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఇంత ఆలస్యం ఎందుకు అని పోలీసులను ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్లు ఎందుకు లేవని నిలదీశారు. ఎఫ్ఐఆర్‌లో బెంజ్, ఇన్నోవా వాహనాల పేర్లు మాత్రమే ప్రస్తావించారని, అంటే వాహనాలు రేప్ చేశాయా? అని అడిగారు రాజాసింగ్.

నిందితుల్లో ఎంఐఎం, టీఆర్ఎస్ నేతల కొడుకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, దీంతో నిందితుల పేర్లను మార్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుని పోలీస్ కమిషనర్ సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో దోషులను కాపాడేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ మరో ఎమ్మెల్యే రఘు నందన్ రావు ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
విచారణ పూర్తయ్యే వరకు హోంమంత్రిని తొలగించాలి. సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలి. అమ్మాయి కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి. న్యాయం కోసం హైకోర్టులో పిల్ వేస్తాం. తెలంగాణలో ధృతరాష్ట్రుని పాలన కొనసాగుతోంది. హోంమంత్రి మనవడు ఇచ్చిన బ్యాచిలర్స్ పార్టీ వల్లనే రేప్ ఘటన జరిగింది. అమ్మాయిని పబ్‌లోకి ఎలా అనుమతించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications