రాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లని సీతక్క ఓటు.. కారణమిదే..?
రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత సీతక్క ఓటు చెల్లలేదు. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో సీతక్క ఓటును చెల్లని ఓటుగా పరిగణించారు.పోలింగ్ సందర్భంగా జరిగిన పొరపాటు వల్ల ఆమె ఓటు చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న చర్చ జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున తనకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్‌పై పొరపాటున సిరా పడిందని, వేరే బ్యాలెట్ పత్రం ఇవ్వాలని సీతక్క ఎన్నికల అధికారులను కోరారు. ఆమెకు మరో బ్యాలెట్ పేపర్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు.
తప్పనిసరి పరిస్థితిలో సిరా గీత పడిన బ్యాలెట్ పేపర్‌తో ఓటు వేశానని ఆ రోజే సీతక్క తెలిపారు. సిరా చుక్కలు పడినందున తన ఓటు చెల్లుబాటు అవుతుందో, లేదో తనకు తెలియదని చెప్పారు. ఇందులో తన తప్పేమీ లేదని, నిబంధనల ప్రకారమే ఓటేశానని చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె ఓటును ఎన్నికల అధికారులు చెల్లని ఓటుగా పరిగణించారు.

భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. దీంతో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు విష్ చేశారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన బైదాపోసి గ్రామంలో గిరిజన జాతికి చెందిన సంతాల్ కుటుంబంలో 1958 జూన్ 20 న జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. తాతలు పంజాయితీరాజ్ వ్యవస్థలోని గ్రామాధికార్లుగా ఉండేవారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఒడిశా ప్రభుత్వంలో సచివాలయంలో క్లరికల్ పోస్ట్‌లో ముర్ము చేరారు. రాయంగ్‌పూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో పనిచేసే శ్యామ్ చరణ్ ముర్ముని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. అయితే ఇద్దరు కుమారులు చనిపోయారు. భర్త శ్యామ్ చరణ్ 2014లో మరణించారు.
ద్రౌపది ముర్ము రాజకీయాల్లోకి వచ్చారు. 1997లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. రాయ్‌రంగపూర్ నగర పంచాయితీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ కి చెందిన గిరిజన తెగల మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత 2000వ జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రాయరంగపూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో 2000 మార్చి 6 నుండి 2002 వరకు వాణిజ్యం, రవాణాకు స్వతంత్ర బాధ్యతలు నిర్వహించారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications