చంద్రబాబుపై విమర్శలు.. కేసీఆర్‌పై ప్రశంసలు: చివరకు బీజేపీ గూటికి మోత్కుపల్లి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతయ జనతా పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడితో కలిసి సోమవారం ఢిల్లీకి పయనమయ్యారు.

జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి మోత్కుపల్లి..
తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆ పార్టీ కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి పలువురు కీలక నేతలు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు వారి బాటలోనే మోత్కుపల్లి నర్సింహులు కూడా చేరారు. మంగళవారం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు కాషాయం కండువా కప్పుకోనున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీకి పయనమయ్యారు. ఇటీవల మోత్కుపల్లి ఇంటికి వెళ్లి బీజేపీలోకి రావాలంటూ ఆయనను ఆహ్వానించారు. రెండు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం మోత్కుపల్లి బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

చంద్రబాబును తీవ్రంగా విమర్శించి..
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మోత్కుపల్లి నర్సింహులు కీలక నేతగా కొనసాగిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హాయంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో విభేదాల కారణంగా ఆయన టీడీపీని వీడారు. ఆ తర్వాత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదంటూ తిరుపతికి వెళ్లి మరీ మొక్కుకున్నారు.

కేసీఆర్‌పై ప్రశంసలు.. చివరకు
టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత మోత్కుపల్లి రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. గతంలో పలుమార్లు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కూడా చేశారు. కేసీఆర్ చేపడుతున్న పథకాలు బాగున్నాయంటూ కొనియడారు. దీంతో మోత్కుపల్లి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. తాజాగా, ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, మోత్కుపల్లి చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications