హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రఘురామ అనుచరుల హడల్.. ఏకంగా కానిస్టేబుల్‌ను కిడ్నాప్.. 7777 నంబర్ కారులో ఎక్కించుకొని..

|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఏం చేసినా సంచలనమే. అవును ఆయన నిన్న భీమవరం పర్యటనకు రాకపోవడం ఏమో గానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో విసుగెత్తి పోయారు. అవును హైదరాబాద్‌లోనే ఉన్నారు. పీఎంవో నుంచి వచ్చిన లిస్ట్‌లో అతని పేరు లేకపోవడం ఓ కారణం అయితే.. తనను అరెస్ట్ చేస్తారని అతను భయపడ్డాడు. కానీ హైదరాబాద్‌లో అతని అనుచరులు రెచ్చిపోయారు. ఏకంగా ఓ కానిస్టేబుల్‌నే కిడ్నాప్ చేశారు.

కానిస్టేబుల్ కిడ్నాప్..

కానిస్టేబుల్ కిడ్నాప్..

ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫారూఖ్ భాషాను పోలీసులు నిన్న కారులో ఎక్కించుకుని వెళ్లారు. మీడియా ఉండగానే వారు ఈ ధైర్యం చేశారు. రఘురామ ఇంట్లో 3 గంటల పాటు ఉంచారు. అతనిపై దాడి చేసినట్టు విశ్వసనీయ సమాచారం.. అనుచరులు రెచ్చిపోయిన సమయంలో రఘురామ ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది. అతని ప్రోద్బలంతోనే దాడి జరిగి ఉంటుంది.

కారు నెంబర్ ఇదే..

కారు నెంబర్ ఇదే..

రఘురామ అనుచరులు 7777 నంబర్ కారులో వచ్చారట. కానిస్టేబుల్‌ను లాక్కెళ్లారని ఫిర్యాదు వచ్చింది. అయితే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతను ప్రధాని మోడీ భద్రత కోసం డ్యూటీ చేస్తున్నాడు. ఐఎస్బీ గేట్ వద్ద డ్యూటీ చేస్తున్నారట. విధుల్లో ఉండగా.. ఇలా వ్యవహరించారు. కారులో తీసుకెళ్లారని సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు.

కిడ్నాప్ ఎందుకు..?

కిడ్నాప్ ఎందుకు..?

కానిస్టేబుల్‌ను రఘురామ అనుచరులు ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియడం లేదు. ఏపీలో సీఎం జగన్‌తో వివాదం ఉంది. మరీ తెలంగాణలో ఓ ఖాకీని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉంది. అతనిని వేధించడానికి కారణం ఏమై ఉంటుంది. ఇవన్నీ సశేష ప్రశ్నలే.. కాప్ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపితే ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంది.

కారణం ఇదేనా..?

కారణం ఇదేనా..?

గత కొన్నాళ్లుగా ఏపీ సీఎం జగన్‌తో రఘురామకు వివాదం ఉంది. వివిధ అంశాలపై ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అతనిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓం బిర్లాను వైసీపీ ఎంపీలు చాలా సందర్భాల్లో కోరారు. కానీ వేటు మాత్రం పడలేదు. దీంతో అతను పక్కలో బల్లెంలా మారారు. ఇప్పుడు కానిస్టేబుల్ కిడ్నాప్.. దాడి చేయడం కలకలం రేపుతుంది.

English summary
ysrcp rebel mp raghurama krishnaraju followers kidnap inteligence constable farooq basha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X