Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన ముమైత్ ఖాన్ ... క్యాబ్ డ్రైవర్ రాజుపై ఫిర్యాదు

సినీనటి ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందని హైదరాబాదుకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముమైత్ ఖాన్ గోవా పర్యటన కోసం తన క్యాబ్ బుక్ చేసుకుని ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపిస్తున్నాడు క్యాబ్ డ్రైవర్ . తనకు జరిగిన అన్యాయం మరే ఇతర డ్రైవర్లకు జరగకూడదని ఈ విషయాన్ని బహిర్గతం చేస్తానని చెప్పారు. దీంతో ముమైత్ ఖాన్ క్యాబ్ డ్రైవర్ ను మోసం చేశారన్న ఆరోపణలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో క్యాబ్ డ్రైవర్ రాజుపై ఫిర్యాదు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో క్యాబ్ డ్రైవర్ రాజుపై ఫిర్యాదు

తాజాగా డబ్బుల కోసం క్యాబ్ డ్రైవర్ రాజు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సినీనటి ముమైత్ ఖాన్ ఆరోపించారు. తనకు క్యాబ్ డ్రైవర్ ను చీట్ చేయాల్సిన అవసరం ఏంటి అని ముమైత్ ఖాన్ మండిపడ్డారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సినీనటి ముమైత్ ఖాన్ క్యాబ్ డ్రైవర్ రాజుపై ఫిర్యాదు చేశారు. రెండు గత రెండు రోజులుగా తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై పోలీసులకు ఆమె రాతపూర్వకంగా కంప్లైంట్ చేశారు. కావాలనే కొందరు తనను టార్గెట్ చేసి తన పరువుకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ముమైత్ ఖాన్ మండిపడ్డారు.

డ్రైవర్ రాజుతో తనకు ప్రాణహాని ఉందని ముమైత్ ఆరోపణ

డ్రైవర్ రాజుతో తనకు ప్రాణహాని ఉందని ముమైత్ ఆరోపణ

12 ఏళ్లుగా తాను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని, తన గురించి అందరికీ తెలుసు అని ఆమె పేర్కొన్నారు. డ్రైవర్ రాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతడు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ముమైత్ ఖాన్ తెలిపారు. తను రాజును అసభ్యంగా తిట్ట లేదని, బూతులు మాట్లాడలేదని అతనే గోవా టూర్ లో ర్యాష్ గా డ్రైవ్ చేసి తనను భయాందోళనకు గురి చేశాడని ఆమె మీడియాకు వెల్లడించారు. తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అబద్ధాలు అంటూ ముమైత్ ఖాన్ మండిపడ్డారు.

 క్యాబ్ డ్రైవర్ పై కఠిన చర్య తీసుకోవాలని పోలీసులను కోరిన ముమైత్ ఖాన్

క్యాబ్ డ్రైవర్ పై కఠిన చర్య తీసుకోవాలని పోలీసులను కోరిన ముమైత్ ఖాన్

డ్రైవర్ కి ఇవ్వాల్సిన డబ్బులు పూర్తిగా చెల్లించానని పేర్కొంది ముమైత్ ఖాన్. డ్రైవర్ రాజు ఇంకా తనకు డబ్బు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై క్యాబ్ మేనేజర్ కు, కుటుంబ సభ్యులకు కూడా ఫిర్యాదు చేశానన్నారు ముమైత్ ఖాన్. పోనీలే పేద వాడని వదిలి పెడితే తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆమె మండిపడ్డారు . అతనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ముమైత్ ఖాన్ వివరించారు.

Recommended Video

    53 Years Old Actress Hema Writes Entrance Exam For Ambedkar Open University | Oneindia Telugu
    మీడియాపైన ఫైర్ అయిన ముమైత్ ఖాన్

    మీడియాపైన ఫైర్ అయిన ముమైత్ ఖాన్

    ఇదే సమయంలో మీడియా పైన కూడా విరుచుకుపడ్డారు ముమైత్ ఖాన్. కొన్ని చానళ్లు తనపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రచారం చేస్తున్నాయని తన క్యారెక్టర్ ను జడ్జ్ చేసే అధికారం మీడియాకు ఎక్కడిది అంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఫ్లైట్ లో పెంపుడు జంతువులను అనుమతించకపోవడంతోనే క్యాబ్లో వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్న ఆమె ఈ తనపై కావాలని జరుగుతున్న దుష్ప్రచారంగా తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+