హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌ను పాక్‌లో కలపాలని ఎంఐఎం.., ఓట్ కట్టర్‌గా టీఆర్ఎస్: మురళీధర్ రావు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు.. అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీని హైదరాబాద్ నగర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

 టాలీవుడ్‌ బాధ్యత మాదే, జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలోనూ స్థానం: చిరంజీవి, నాగార్జునతో కేసీఆర్ టాలీవుడ్‌ బాధ్యత మాదే, జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలోనూ స్థానం: చిరంజీవి, నాగార్జునతో కేసీఆర్

1948లో హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లో కలపాలని ఎంఐఎం కోరిందని మురళీధర్ రావు చెప్పారు. బీహార్ ఎన్నికల్లో గెలిచిన ఎంఐఎం ఎమ్మెల్యే.. హిందుస్థాన్ పేరుతో ప్రమాణ స్వీకారం చేయనని చెప్పారని గుర్తు చేశారు.

 BJP leader Muralidhar rao slams trs govt and mim party.

ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్.. పాతబస్తీలో ఓట్ కట్టర్ పార్టీగా మారిందని మురళీధర్ రావు అన్నారు. ఢిల్లీ మున్సిపాలిటీలో 30 ఏళ్లుగా బీజేపీ గెలుస్తూ వస్తోందని తెలిపారు. బీజేపీ చెప్పింది చేస్తుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ ఎన్నికల్లో సునామీ రాబోతుందని, ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదని మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక టీఆర్ఎస్ మేనిఫెస్టోపైనా తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో చెత్త బుట్టలో వేసేందుకు తప్ప ఎందుకు పనికి రాదని అన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఓ చెత్తబుట్టలో వేశారు మురళీధర్ రావు సహా నేతలు.

Recommended Video

#Bihar : బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక... రేపే ప్రమాణ స్వీకారం!

'గత నాలుగు నెలలుగా కోవిడ్ సేవలు అందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్ లకు జీతాలు ఇవ్వని టీఆర్ఎస్ ప్రభుత్వం . కోవిడ్ కారణంగా రాత్రనక , పగళనక ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లను రోడ్ మీద పడేసింది ప్రభుత్వం' అని మురళీధర్ రావు మండిపడ్డారు. జీహెచ్ఎం ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితాలే పునరావృతమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

English summary
BJP leader Muralidhar rao slams trs govt and mim party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X