హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పట్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ లేనట్టే .. కరోనా కారణంగా వాయిదా : ప్రకటించిన మంత్రి ఈటెల రాజేందర్

|
Google Oneindia TeluguNews

ప్రతి ఏడాది నూతన సంవత్సరంతో పాటుగా, హైదరాబాద్ లో సందడి చేసి నాంపల్లిలోని అతిపెద్ద నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈ సంవత్సరం కరోనా కారణంగా మరికొంత కాలానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
నుమాయిష్ గా ప్రసిద్ది చెందిన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ వార్షిక ఎగ్జిబిషన్ ప్రతి ఏడాది జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమవుతుంది . అయితే కొద్ది రోజులు ఆలస్యమైనప్పటికీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. కానీ కరోనా కారణంగా జనవరి నెలలో ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే దాఖలాలు కనిపించడం లేదు.

ప్రైవేటు ఆసుపత్రులపై మంత్రి ఈటెల సీరియస్ .. నేడో, రేపో సమావేశం .. ఫైనల్ వార్నింగ్ ప్రైవేటు ఆసుపత్రులపై మంత్రి ఈటెల సీరియస్ .. నేడో, రేపో సమావేశం .. ఫైనల్ వార్నింగ్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నుమాయిష్ కొద్ది రోజుల పాటు వాయిదా : మంత్రి వెల్లడి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో నుమాయిష్ కొద్ది రోజుల పాటు వాయిదా : మంత్రి వెల్లడి

నుమాయిష్ ఎగ్జిబిషన్ త్వరలో ప్రారంభం అవుతుందని నిర్వాహకులు ప్రకటించిన ఆనందం ఎంతోకాలం నిలవలేదు.వాస్తవానికి రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన నుమాయిష్ ఎగ్జిబిషన్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు . కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నుమాయిష్ ను కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తిరిగి నుమాయిష్ ఎప్పుడు ప్రారంభిస్తామనేది త్వరలో వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు.


వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

మార్చి, ఏప్రిల్ లో అప్పటి పరిస్థితిని బట్టి నిర్వహించే అవకాశం

మార్చి, ఏప్రిల్ లో అప్పటి పరిస్థితిని బట్టి నిర్వహించే అవకాశం

ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రంగా చలి ఉన్న నేపథ్యంలో, కరోనా వైరస్ సెకండ్ వేవ్ , కరోనా కొత్త స్ట్రెయిన్ టెన్షన్ కూడా కొనసాగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎగ్జిబిషన్ ను తిరిగి మార్చి, ఏప్రిల్ లో నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా, అది కూడా కరోనా ప్రభావం తగ్గినట్లుగా భావిస్తేనే నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైన 79 సంవత్సరాలలో మొదటిసారిగా ఎగ్జిబిషన్ అనుకున్న సమయానికి కాకుండా, కొన్ని నెలల పాటు వాయిదా పడింది.

తమిళ కుట్టి ఐశ్వర్య మీనన్ హాట్ ఫొటోలు

 నిరాశ కలిగించే అంశమే కానీ కరోనా నేపధ్యంలో అనివార్యం

నిరాశ కలిగించే అంశమే కానీ కరోనా నేపధ్యంలో అనివార్యం

46 రోజులపాటు నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈసారి 81 వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోసం తేదీ మరియు షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారని అందరూ ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఎగ్జిబిషన్ వాయిదా పడడం కాస్త నిరాశ కలిగించే అంశమే కానీ కరోనా నేపధ్యంలో అనివార్యం అని సొసైటీ భావిస్తుంది. లక్షలాదిగా ప్రజలు వచ్చే ఎగ్జిబిషన్ లో కరోనా మార్గ దర్శకాలు పాటిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ భావిస్తున్నా ప్రస్తుతం అంత రిస్క్ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది .

 నుమాయిష్ వాయిదాతో వేలాది మంది ఉపాధికి గండికొట్టిన కరోనా

నుమాయిష్ వాయిదాతో వేలాది మంది ఉపాధికి గండికొట్టిన కరోనా

హైదరాబాద్ లోనే కాకుండా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుండి చాలామంది ఈ అతిపెద్ద నుమాయిష్ ఎగ్జిబిషన్ కు వచ్చి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. అంతేకాదు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దేశ వ్యాప్తంగా 20 వేల మందికి జీవనోపాధి లభిస్తుంది. వందల కోట్ల రూపాయల వ్యాపారం జరగడమే కాకుండా, ప్రభుత్వానికి ఎగ్జిబిషన్ ద్వారా ఆదాయం సమకూరుతుంది. కానీ కరోనాతో నుమాయిష్ వాయిదా పడటమే కాదు ఎంతో మంది ఉపాధికి గండి కొట్టింది . తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఇదే విధంగా కొనసాగితే ఎగ్జిబిషన్ నిర్వహిస్తారా అనేది అనుమానించాల్సిన అంశమే.

English summary
Nampally Exhibition Society President and State Minister Etela Rajender clarified that postponing Numaish exhibition for a few days in the wake of increasing corona spread. He announced that they would soon reveal when Numaish will start again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X