నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం

జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 10లో జరిగిన ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది.

నారా లోకేష్ పాదయాత్రకు హాజరైన నందమూరి తారకరత్న ప్రస్తుతం నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న ఇంకా పూర్తిగా కోలుకోకముందే నందమూరి కుటుంబంలో మరో వ్యక్తి కారు ప్రమాదానికి గురవడంతో నందమూరి కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్-10 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే కారు మాత్రం నుజ్జు నుజ్జు అయ్యింది. స్వల్ప గాయాలే కావడంతో రామకృష్ణ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన ఇటీవలే బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించి వచ్చారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Nandamuri Ramakrishna sustained minor injuries in a road accident

అనంతరం మీడియాతో మాట్లాడిన రామకృష్ణ క్రమక్రమంగా తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. ఎక్మో పెట్టలేదని.. అదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టేశారు. తారకరత్న శరీర అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయని.. న్యూరో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని, అంతకు మించి ఎటువంటి ప్రమాదం లేదని రామకృష్ణ వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు సందర్భంగా కూడా రామకృష్ణ స్పందించారు. వర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేవారు. రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు ఒకే విధానం ప్రకారం నడవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ యూనివర్సిటీని స్థాపించారని, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేశారని రామకృష్ణ చెప్పారు. అప్పడప్పుడు వైసీపీ విధానాలను రామకృష్ణ విమర్శిస్తుంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారసులెవరంటూ వివిధ రకాల కోణాల్లో సందేహాలు, ఆందోళనలు వ్యక్తమైనప్పుడు నందమూరి కుటుంబం మొత్తం చంద్రబాబునాయుడికే మద్దతుగా ఉంటుందని రామకృష్ణ గతంలో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+