MMTS: ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు పొడిగింపు.. ఎయిర్ పోర్టుకు వెళ్లడం ఇక సులభమే..!
దేశంలో చౌకైన ప్రయాణం అంటే రైలు ప్రయాణమే.. అందుకే ఎక్కువ మంది రైళ్లులో ప్రయాణిస్తారు. దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా చాలా మంది ట్రైన్లలో జర్నీ చేస్తారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తిరగాలంటే బస్సులు ఆశ్రయించాల్సిందే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రైల్వే శాఖ ఎంఎంటీఎస్(MMTS) రైళ్లను నడుపుతుంది.
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మరో 40 ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 48 కిలోమీటర్లు నడుస్తున్న ఎంఎంటీఎస్ సర్వీసులను 0 కిలోమీటర్లకు విస్తరించారు. దీంతో ఇప్పటి వరకు ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య 106 చేరినట్లు అయింది.

ఈ 40 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో కొత్తగా సికింద్రాబాద్ - మేడ్చల్ మధ్య 20 సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. మల్కాజిగిరి, దయానంద్ నగర్, సఫిల్ గూడ, రామకృష్ణాపురం, అమ్ముగూడ, అల్వాల్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, గౌడవెల్లి స్టేషన్ల పరిధిలోని ప్యాసింజర్లు కొత్త సర్వీసులు ఉపయోగించుకోవచ్చు.
మరో 20 ఎంఎంటీఎస్ సర్వీసులను లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదు ఫలక్ నుమా వరకు ఉన్న సర్వీసులను ఉందానగర్ వరకు పొడిగించారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికి ఈ సర్వీసులను పొగడించారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు వేగంగా జరుగుతున్నట్లు అరుణ్ కుమార్ తెలిపారు.
రెండో దశలో భాగంగా మొత్తం 100 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందులో 50 కిలోమీటర్ల వరకు ఎంఎంటీఎస్ పనులు పూర్తయిందని పేర్కొన్నారు. మరో 50 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ప్రస్తుతం పనులు జరుగుతున్న 50 కిలోమీటర్లలో సనత్‌నగర్-మౌలాలి మధ్య 21 కిలోమీటర్లు, సికింద్రాబాద్-ఘట్‌కేసర్ మధ్య 19 కిలోమీటర్లు, సీతాఫల్‌మండి-మౌలాలి-మల్కాజ్‌గిరి మధ్య 10 కిలోమీటర్ల మేర ఉందని వివరించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి రెండో దశ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. చర్లపల్లి శాటిలైట్ టెర్నినల్‌ను డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌ను విస్తరించాలని రైల్వేశాఖ నిర్ణయించినప్పటికీ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఎంఎంటీఎస్ విస్తరణకు సహకరించలేదని తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎయిర్ పోర్టు దగ్గరలో ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ సర్వీలు పొడగించడమే కాదు.. అక్కడ నుంచి విమానాశ్రయానికి ఆటో, క్యాబ్ సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications