తెలంగాణలో 30 లక్షలకు చేరువగా: టెస్టుల్లో కేసీఆర్ సర్కార్ దూకుడు: కొత్త కేసుల్లో అదే తీరు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తోంది. రోజూ 50 నుంచి 60 వేల వరకు టెస్టులు నమోదవుతున్నాయి. కరోనా పరీక్షల్లో ఇదివరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం..వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ టెస్టులను నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా చేపట్టిన కరోనా రోజువారీ నిర్ధారణ పరీక్షల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 29,96,001 పరీక్షలను నిర్వహించినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,103 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 మంది మరణించారు. 2,243 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,91,386కు చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,60,933గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1127కు చేరుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు 29,326గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 23,880 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Newly 2103 Covid19 positive cases and 11 deaths reported in Telangana last 24 hours

అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 298 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్-24, భద్రాద్రి కొత్తగూడెం-102, జగిత్యాల-46, జనగామ-29, జయశంకర్ భూపాలపల్లి-25, జోగుళాంబ గద్వాల-13, కామారెడ్డి-53, కరీంనగర్-103, ఖమ్మం-93, కొమరంభీమ్ ఆసిఫాబాద్-26, మహబూబ్ నగర్-45, మహబూబాబాద్-45, మంచిర్యాల-27, మెదక్-30, మేడ్చల్ మల్కాజ్‌గిరి-176, ములుగు-31, నాగర్ కర్నూలు-32, నల్లగొండ-141, నారాయణపేట్-8, నిర్మల్-24, నిజామాబాద్-57, పెద్దపల్లి-31, రాజన్న సిరిసిల్ల-40, రంగారెడ్డి-172, సంగారెడ్డి-63, సిద్ధిపేట్-92, సూర్యాపేట్-51, వికారాబాాద్-24, వనపర్తి-41, వరంగల్ రూరల్-35, వరంగల్ అర్బన్-85, యాదాద్రి భువనగిరి-31 కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 55,359 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 29,96,001కి చేరుకుంది. ప్రతి 10 లక్షల మందికీ 80,494 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Recommended Video

    53 Years Old Actress Hema Writes Entrance Exam For Ambedkar Open University | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+