నవ దంపతులకు నో కరోనా.. నిహారిక-చైతన్యకు వైరస్ రుమార్లపై నాగబాబు క్లారిటీ..
మెగా కుటుంబంలో కరోనా కలకలం రేపింది. రాం చరణ్.. వరుణ్ తేజ్‌కు వరసగా పాజిటివ్ రాగా.. మిగతావారి అంశం చర్చకొచ్చింది. అయితే నవ దంపతులు నిహారిక చైతన్యకు కూడా కరోనా వచ్చిందనే ప్రచారం జరిగింది. దీంతో నాగబాబు స్పందించారు. అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. అయితే తనకు నెగటివ్ వచ్చిందని.. పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఉపాసన చెప్పడం చర్చానీయాంశమైంది.

వేడుకల్లో సందడి..
జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక మ్యారేజ్‌లో మెగా, అల్లు కుటుంబాలు సందడి చేశాయి. ఆ తర్వాతే నిహారిక బర్త్ డే రాగా.. ఆ వెంటనే క్రిస్మస్ కూడా వచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి పార్టీలు చేసుకుంది. వేడుకల్లో ప్రతీ ఒక్కరూ చాలా సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాతే తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని రాం చరణ్ ట్వీట్ చేశారు. దీంతో వేడకుల్లో హాజరైన వారి గురించి చర్చ జరిగింది. వరుణ్ తేజకు పాజిటివ్ రాగా.. మిగతా వారి అంశం చర్చకొచ్చింది.

నవ దంపతులకు నో కరోనా
నవ దంతులు నిహారిక, చైతన్యకు కరోనా సోకిందనే అనుమానాలు మొదలయ్యాయి. నిహారికకు కూడా కరోనా సోకి ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. వారికి కరోనా పాజిటివ్ రాలేదని స్పష్టంచేశారు. హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లే ముందు ఈ నెల 26వ తేదీన ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. తిరిగి వచ్చేటప్పుడు డిసెంబర్ 29న ముంబై ఎయిర్ పోర్ట్‌లో కరోనా టెస్ట్ చేయించుకున్నారని వివరించారు. ఆ రెండు సందర్భాల్లో వారికి నెగెటివ్ వచ్చిందని నాగబాబు తెలిపారు.

ఊపిరి పీల్చుకున్న మెగా అభిమానులు
నాగబాబు క్లారిటీతో మెగా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నవ దంపతులకు కరోనా వైరస్ అనే పుకార్లపై ఆందోళన చెందారు. కానీ అదీ ఫేక్ అని చెప్పడంతో రూమర్లకు చెక్ పెట్టినట్టయ్యింది. అయితే చరణ్, వరుణ్‌తో నిహారిక చైతన్య సన్నిహితంగా ఉన్నారని కొందరు అంటున్నారు. మరి వారికి వైరస్ వ్యాపించదా అని మొండిగా అడిగే వారు కొందరు ఉన్నారు. కానీ ఇప్పటివరకు అయితే నిహారిక దంపతులకు కరోనా వైరస్ సోకలేదని నాగబాబు వివరణ ఇచ్చారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications