Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిమ్మగడ్డకు సెర్బియాలో బెయిల్ వచ్చింది... కానీ ఇప్పట్లో ఇండియాకు రావడం కష్టం..!

Recommended Video

    షరతులతో కూడిన బెయిలుపై నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల || Nimmagadda Prasad Released On Bail || Oneinda

    సెర్బియా పోలీసుల అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిలుపై నిమ్మగడ్డ ప్రసాద్ విడుదలయ్యారు.గత ఐదు రోజులుగా పోలీసుల నిర్బంధంలో న్న నిమ్మగడ్డకు శుక్రవారం రాత్రి కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే, బెల్‌గ్రేడ్ నగరాన్ని, సెర్బియా దేశాన్ని విడిచి వెళ్లరాదన్న షరతు విధించింది.సెర్బియా లోని బెల్‌గ్రేడ్ జైలు నుండి విడుదలైన నిమ్మగడ్డ ప్రసాద్ ను అక్కడి న్యాయస్థానం కఠిన షరతులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది .దీంతో బెయిలుపై విడుదలయినప్పటి కీ నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా లోనే ఉండవలసి ఉంది.

     నిమ్మగడ్డ నిర్బంధాన్ని సమర్ధించిన బెల్‌గ్రేడ్ లోని ఉన్నత న్యాయస్థానం

    నిమ్మగడ్డ నిర్బంధాన్ని సమర్ధించిన బెల్‌గ్రేడ్ లోని ఉన్నత న్యాయస్థానం

    ‘వాన్‌పిక్' కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డపై రస్ ఆల్ ఖైమా (రాక్) దేశ అభ్యర్థన మేరకు 2016లో అబుదాబిలోని ఇంటర్‌‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. ఇక దీంతో గత నెల 27న సెర్బియా వెళ్లిన నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిమ్మగడ్డ నిర్బంధాన్ని బెల్‌గ్రేడ్‌లోని ఉన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. ఇక నిమ్మగడ్డ ప్రసాద్ పై నిర్బంధం అమల్లో ఉంటుందని పేర్కొన్న న్యాయస్థానం ప్రతి రెండు నెలలకు ఒకసారి పరిస్థితులను సమీక్షించి నిర్బంధ ఉత్తర్వులను పొడిగించే అవకాశం కూడా ఉంటుందని తెలియజేసింది. నిమ్మగడ్డ ప్రసాద్ పై నిర్బంధాన్ని గరిష్టంగా ఏడాది వరకు పొడిగించే అవకాశముందని స్పష్టం చేసింది.

    సెర్బియా విడిచి వెళ్లరాదని షరతు విధిస్తూ బెయిల్ మంజూరు చేసిన కోర్టు

    సెర్బియా విడిచి వెళ్లరాదని షరతు విధిస్తూ బెయిల్ మంజూరు చేసిన కోర్టు


    సెర్బియాలో నిందితుడికి నివాసం లేదు కాబట్టి రాగేటరీ లేఖల ఆధారంగా అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యయేలోగా దేశం విడిచి వెళ్లడానికి, పారిపోవడానికి కానీ, తప్పించుకోవడానికి కానీ అవకాశం ఉండడంతో .. అలాంటివి ఏవైనా జరిగితే వెంటనే నిర్బంధంలోకి తీసుకోవచ్చంటూ పోలీసుల చర్యను సమర్థించింది. అంతేకాదు, ఈ విషయంలో నిందితుడి వాదనలు కూడా వినాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు సెర్బియా చట్టాలు అందుకు అనుమతిస్తున్నాయని పేర్కొంటూ నిమ్మగడ్డ విషయంలో షరతులతో కూడిన బెయిల్ కు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

     జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో నిమ్మగడ్డ రాలేకపోవటానికి కారణాలు చెప్తూ మెమో దాఖలు

    జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో నిమ్మగడ్డ రాలేకపోవటానికి కారణాలు చెప్తూ మెమో దాఖలు

    ఇక మరోపక్క సీబీఐ కోర్టుకు జగన్ అక్రమ ఆస్తుల కేసులో హాజరు కావలసిన నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో అరెస్ట్ అయిన నేపధ్యంలో ఆయన తరపు న్యాయవాది సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెర్బియా పోలీసుల నిర్బంధంతో ఆయన స్వదేశానికి రాలేకపోతున్నారని మెమోలో పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఐరోపా దేశమైన సెర్బియా పోలీసులు అరెస్టు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది . వ్యక్తిగత పర్యటన నిమిత్తం అక్కడకు వెళ్ళిన ఆయనను సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక జగన్ ఆయనను ఇండియాకు తీసుకురావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర సహాయం కోరుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+