హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్మలమ్మను ఆడేసుకుంటోన్నారుగా: మామూలుగా కాదండోయ్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. నెటిజన్ల చేతికి చిక్కారు. ఆమెపై భారీగా ట్రోల్స్ పడుతోన్నాయి. వేలసంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. ప్రత్యేకించి- తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యూజర్లకు నిర్మలమ్మ టార్గెట్ అయ్యారు. ఈ విషయంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం- ఓ నెటిజన్ అవతారం ఎత్తారు. ట్రోల్స్ విషయంలో తానూ ఓ చెయ్యి వేశారు.

అసలు కథేంటీ..?

నిర్మల సీతారామన్ ఇటీవలే తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లాను ఆమె సందర్శించారు. బిర్కూర్‌లో ఓ రేషన్ షాపుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడికక్కడే జిల్లా కలెక్టర్‌ జితేష్ వీ పాటిల్‌ను నిలదీశారు. రేషన్‌ దుకాణాల షాపుల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అందుతోన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా అధికంగా ఉందని, అలాంటప్పుడు ప్రధాని మోదీ ఫొటోను ఎందుకు ఉంచలేదంటూ ప్రశ్నించారు.

బియ్యంలో కేంద్రం వాటా..

రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటా 29 రూపాయలుగా ఉంటోందని, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తోన్నది అయిదు రూపాయలు మాత్రమేనని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. అన్ని రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌ను అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు రేషన్ షాపుల్లో మోదీ ఫొటోలు పెట్టేలా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పర్యవేక్షించాలని సూచించారు.

నెటిజన్లు భగ్గు..

ఈ పరిణామాలపై బీజేపీ ప్రతికూల నెటిజన్లు భగ్గుమంటోన్నారు. నిర్మల సీతారామన్‌ను టార్గెట్‌గా చేసుకుని, భారీగా ట్రోల్స్ చేస్తోన్నారు. వేల సంఖ్యలో పోస్టింగులు పెడుతున్నారు. ఆమెను యాక్ట్ ఆఫ్ గాడ్ మినిస్టర్‌గా సంబోధిస్తోన్నారు. మంత్రి హోదాలో రాష్ట్ర పర్యటనకు వచ్చారా? బీజేపీ కార్యకర్తగా పార్టీ తరఫున ప్రచారానికి వచ్చారా? అంటూ నిలదీస్తోన్నారు.

పెట్రోల్ బంకులపై వద్దా..?

బియ్యంలో కేంద్రం వాటా ఉందని మోదీ ఫొటో పెట్టమంటున్నారు సరే.. దేశానికి తెలంగాణ ఇచ్చే కాంట్రిబ్యూషన్ కూడా ఉందని, అన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ ఫొటోలు పెట్టగలరా? అంటూ సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన విషయాన్ని గుర్తు చేస్తూ అక్కడ మోదీ ఫొటోలు వద్దా అంటూ కౌంటర్ అటాక్ చేస్తోన్నారు నెటిజన్లు. నెలకోసారి వెళ్లే రేషన్ షాప్‌ల కంటే- రోజూ కనిపించే సిలిండర్లపై వాటి రేట్లను తెలుపుతూ మోదీ ఫొటో పెట్టడం బెటర్ అంటూ చురకలు అంటిస్తోన్నారు.

English summary
Nirmala Sitharaman trolled by netizens for going tough on Kamareddy collector,Here are the trolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X