• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీఆర్ఎస్ లో క్రమశిక్షణ లేదు..! గౌరవం అంతకన్నా లేదు..! అందుకే రాజీనామా అన్న సోమారపు..!!

|

రామగుండం/హైదరాబాద్‌: గులాబీ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నప్పటికి తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కనుసన్నల్లో పరిష్కారం అవుతుండేవి. కాని పెద్దపల్లి జిల్లా రాజకీయాలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి. ఆర్టీసి మాజీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ పార్టీ నేతల తీరును ఎండగడుతూనే గులాబీ పార్టీకి రాజీనామా చేసారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పార్టీలో చీడపురుగులా పరిణమించాడని మండిపడ్డారు. గులాబీ పార్టీలో క్రమశిక్షణ కొరవడిందని, ఎవరికి వారు యమునా తీరులా వ్యవహరిస్తున్నారని సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు.

బీజేపీ టార్గెట్ గా టీఆర్ఎస్ వ్యూహం ..పార్టీ శ్రేణులకు కేటీఆర్ కఠిన ఆదేశం

టీఆర్ఎస్ పార్టీలో తొలి కుదుపు..! పార్టీకి రాజీనామా చేసిన ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌..!!

టీఆర్ఎస్ పార్టీలో తొలి కుదుపు..! పార్టీకి రాజీనామా చేసిన ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌..!!

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్‌ నేత, తెలంగాణ ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు. సత్యనారాయణతోపాటు మాజీ కార్పొరేటర్లు పలువురు పార్టీకి రాజీనామా లేఖలు సమర్పించారు. రామగుండం నియోజవర్గం నుంచి గత శాసనసభ ఎన్నికల్లో సత్యనారాయణ పరాజయం చవిచూశారు. అప్పటినుంచి పార్టీలో తనకు సరైన గౌరవం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోమారపు సత్యనారాయణ రాజీనామా..! పార్టీలో క్రమశిక్షణ లోపించిందన్న అసంతృప్తి నేత..!!

సోమారపు సత్యనారాయణ రాజీనామా..! పార్టీలో క్రమశిక్షణ లోపించిందన్న అసంతృప్తి నేత..!!

ఈ నేపథ్యంలో సత్యనారాయణ తన అనుచరులతో కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. నేను అడగకుండానే సీఎం గతంలో తనకు ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారన్నారు. కానీ, ప్రస్తుతం గులాబీ పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందన్నారు. కనీసం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు కూడా తనకు ఇవ్వలేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో తన ఓటమికి మాజీ ఎంపీ, ముఖ్య నాయకులే కారణమని దుయ్యబట్టారు.

బాల్క సుమన్ పై ఘాటు విమర్శలు..! పార్టీకి అవరోధమన్న సత్యనారాయణ..!!

బాల్క సుమన్ పై ఘాటు విమర్శలు..! పార్టీకి అవరోధమన్న సత్యనారాయణ..!!

టీఆర్ఎస్ కీలక నేత సోమారపు సత్యనారాయ ఆ పార్టీకి మంగళవారం చేసిన రాజీనామా గులాబీ పార్టీని కుదుపుకు గురిచేసింది. పార్టీలో తనను వేదిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తన ఓటమికి కారణం టీఆర్ఎస్ స్థానిక నాయకులేనని తెలిపారు. టీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన సోమారపు సత్యనారయణ రాజీనామాతో ఆ పార్టీలో కలకలం సృష్టించింది. గత ఎన్నికల్లో తన ఓటమికి బాల్కసుమన్ తో పాటు పలువురు టీఆర్ఎస్ స్థానిక నాయకులని తెలిపారు. పార్టీలో బాల్క సుమన్ ఆగడాలు శృతిమించాయని తెలిపారు సత్యనారాయణ.

పార్టీ లో గౌరవం లేనప్పుడు ఉండలేం..! త్వరలో భవిశ్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న సత్తెన్న..!!

పార్టీ లో గౌరవం లేనప్పుడు ఉండలేం..! త్వరలో భవిశ్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న సత్తెన్న..!!

పార్టీలో గౌరవం లేనప్పుడు కొనసాగడం కష్టమని సత్యనారాయణ పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో అరాచకం పెరిగిపోయిందని అన్నారు. పార్టీ సభ్యత్వం తో తనకు సంబంధం లేనట్టు స్ధానికి నేతలు వ్యవహరించడం దారుణమన్నారు సత్యనారాయణ. అందుకు సంబందించిన పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ రావు పార్టీని పట్టించుకునే పరిస్థితిలో లేరని, కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతంలో రామగుండం నుంచి శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రామగుండం శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రామగుండం నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా రాజీనామా చేసిన ఆయన భవిశ్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని వెళ్లడించినప్పటికి, బీజేపి లో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Internal conflicts in the rose party have skyrocketed. Telangana CM Chandrasekhar Rao's eyelashes were resolved in spite of their small minds. But the politics of the Pedda palli district are at one time. Former chairman of the RTC, Somarapa Satyanarayana,resigned from the party as the party's leadership is drying up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more