hyderabad: సిటీ వాసులకు అలర్ట్, రేపు, ఎల్లుండి ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్ నగర వాసులకు ముఖ్య గమనిక. రేపు, ఎల్లుండి (మార్చి 9, 10) పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 9, 10 తేదీలలో నీటి సరఫరా ఉండదని, ప్రజలు ఇందుకు అనుగుణంగా తమ పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు.
కాగా, ఉస్మాన్ సాగర్, హకీంపేట ప్రాంతాల మధ్య జరుగుతోన్న నీటిపైపుల మరమ్మతుల కారణంగా మార్చి 9వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మార్చి 10 మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ తెలిపింది.

హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీ, హుమాయూన్ నగర్, కాకతీయ నగర్, సయ్యద్ నగర్, ఎంఈఎస్ ప్రాంతాలు, ఏసీ గార్డ్స్, రెడ్ హిల్స్, ఇన్‌కమ్ టాక్స్ ఏరియా, సచివాలయం, సీఐబీ క్వార్టర్స్, ఇందిరా నగర్, బీజేఆర్ కాలనీ, అడ్వొకేట్ కాలనీ, హిల్ కాలనీ, గోకుల్ నగర్, నాంపల్లి రైల్వే స్టేషన్, జంగం బస్తీలలో నీటి సరఫరా నిలిచిపోనుందని పేర్కొంది.
ఈ ప్రాంతాలతోపాటు అసెంబ్లీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్డీకాపూల్, సీతారాంబాగ్, గన్ ఫౌండ్రీ, చిరాగ్ అలీ లేన్, అబిడ్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, బీఆర్కే భవన్, బిర్లా మందిర్, హిందీ నగర్, ఘోడే కాబ్ర్, దోమలగూడ, గాంధీనగర్, ఎమ్మెల్యే కాలనీ, తట్టిఖానా, ఎన్బీటీ నగర్, నూర్ నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని వెల్లడించింది. ఈ క్రమంలో ఈ ప్రాంతాల ప్రజలు నీటిని పొదుగా వాడుకోవడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications