అబ్బే.. అదేం లేదు, బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో విభేదాలపై విజయశాంతి

టీఆర్ఎస్ పార్టీపై విజయశాంతి ఫైరయ్యారు. ఆమెపై చేస్తోన్న అసత్య ప్రచారాలను తప్పుపట్టారు. రాష్ట్ర బీజేపీతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. కొందరు కావాలనే లేని పోనివి ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. తనకు సంబంధించి ఏదీ దాపరికం లేదని, కానీ టీఆర్ఎస్ సోషల్ మీడియా తనను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తనకు తెలంగాణ బీజేపీ నాయకత్వంతో సమస్య ఉన్నాయని టీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇదీ తీవ్రమైన కుట్రగా అభివర్ణించారు. ఆ అవాస్తవం ఎంత చెప్పినా నిజం కాదు, కాబోదన్నారు. ఒకవేళ అదే నిజమని ఎవరైనా భావిస్తున్నట్లయితే వారు ఒక నిజం తెలుసుకోవాలని కోరారు.

no issue with bjp state committee:vijayashanti

తను పని చేసుకోవడానికి తెలంగాణతోపాటు బీజేపీలోనే అనేక దక్షిణాది, మరికొన్ని ఇతర రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ నుంచి వీడిపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర బీజేపీతో దూరం వెళ్లిపోవాల్సినంత భేదాభిప్రాయాలు లేవని విజయశాంతి తెలిపారు.

ఇదీ ఎవరో ఒకరు చేస్తోన్న కుట్ర అని వివరించారు. తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే, కొందరు ఇలా చేస్తున్నారని ఫైరయ్యారు. బరి తెగించి మరీ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+