హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తూచ్.. తూచ్... బీజేపీలో చేరడం లేదు, ఊహాగానాలపై ఈటల రాజేందర్

|
Google Oneindia TeluguNews

ఈటల రాజేందర్ ఏ పార్టీలోకి వెళతారు. ఈ అంశం చర్చకు దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ అని ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సంప్రదింపులు జరిపారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈటల రాజేందర్ స్పందించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు.

చేరడం లేదే

చేరడం లేదే

బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఖండించారు. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వివరించారు. మద్దతు కోరేందుకే బీజేపీ నేతలను కలిశానన్నారు. ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి.. మళ్లీ హుజురాబాద్‌ నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. త్వరలో తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. స్వతంత్రంగానే ఉంటానని.. ఎవరితో కలవబోనని ఈటల అన్నారు.

కొత్త పార్టీ పెడతారా..?

కొత్త పార్టీ పెడతారా..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్నమొన్నటి వరకు ఆయన కొత్త పార్టీ పెడుతున్నారని, దానికి జెండా, ఏజెండా కూడా ఖరారయ్యాయని సోషల్‌ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. ఆయన బీజేపీలో చేరుతున్నారని, సోమ, మంగళవారాల్లో జరిగిన పరిణామాలు అందుకు నిదర్శనమని చెబుతున్నారు.

కలిశారా.. లేదా

కలిశారా.. లేదా

సోమవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అదే రాత్రి ఈటల రాజేందర్‌ మాజీ ఎంపీ వివేక్‌ ఫాంహౌస్‌లో కిషన్‌రెడ్డితో కలిసి మాట్లాడారని చెబుతున్నారు. మంగళవారం ఆయన కిషన్‌రెడ్డితో కలిసి మాట్లాడరని కూడా ప్రచారం జరుగుతోంది. సోమ, మంగళవారాల్లో ఏ రోజు ఈటల, కిషన్‌రెడ్డిని కలిశారోగానీ ఈ ఇద్దరు మాత్రం భేటీ అయ్యారని ఇరు వర్గాల నేతలు ధ్రువీకరిస్తున్నారు.

మీట్ కాలే..

మీట్ కాలే..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు ఈటల సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను ఈటల రాజేందర్‌ను కలవలేదని చెప్పారు. ఫోన్‌లో మాత్రమే మాట్లాడానని చెప్పారు. భవిష్యత్‌లో ఈటల రాజేందర్‌తో చర్చలు జరుపుతానన్నారు. అసెంబ్లీలో ఈటల రాజేందర్‌తో కలసి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని కిషన్‌రెడ్డి తెలిపారు. కిషన్ రెడ్డి కామెంట్స్ చేయగా.. ఈటల రాజేందర్ కూడా రియాక్టయ్యారు.

English summary
not joining in bjp ex minister etela rajender clarify
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X