ఉద్యమ సమయంలో అనలే, సెటిలర్స్ కామెంట్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఏపీ నేతలు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించొద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఉద్యమ సమయంలో తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను సెటిలర్స్ అనలేదని గుర్తుచేశారు. ఏపీ సర్కార్ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కడుతూ, నీటిని దోచుకుంటోందని ఆరోపించారు. క్యాచ్ మెంట్ ఏరియా ఎక్కువున్న ప్రాంతానికి ఎక్కువ నీళ్లు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జలవివాదాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్‌ను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని కొంత మంది ఏపీ నేతలు మాట్లాడుతున్నారని, వారు ఒకప్పుడు సెటిలర్స్ కావచ్చేమో కానీ ఇప్పుడు కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణ వారే..
వారు తెలంగాణకు చెందిన వారేనని స్పష్టం చేశారు. ఇప్పటికీ సెటిలర్స్ అనే ముద్ర మీరే వేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ నీటిని ఏపీ దోచుకుంటోందని, నీటి పంపకాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి ఆరోపించారు.

మోడీ చెప్పారు కదా..?
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రధాని మోడీ చెప్పలేదా అని ప్రశ్నించారు. కృష్ణా నదిలో 26 శాతం క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్న ఏపీకి 66 శాతం నీళ్లు పోతున్నాయని చెప్పారు. జీవోల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకుంటోందని, విద్యుత్ ప్రాజెక్టులున్న దగ్గర నుండి నీటిని వాడుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రాజెక్టులకే వ్యతిరేకం..
ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకే వ్యతిరేకం, ఆంధ్రా ప్రజలకు కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు ఉన్నారని ఏపీ సీఎం జగన్, మంత్రులు మాట్లాడటం బాధాకరమన్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందని ధ్వజమెత్తారు.

ఎడారి చేస్తారా..? ఏంటీ
పాలమూరు జిల్లాను ఎడారిని చేసేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌ను కాదని పెన్నా నదికి నీటిని తరలించడం మంచిది కాదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు.. ఈ విషయం కృష్ణా బోర్డుకు తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ సహించరని అన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications