హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేఖాస్త్రం: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలం స్వాధీనం చేసుకోండి.. సీఎంకు వినతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో గల ఎన్టీఆర్ భవన్ మరోసారి వివాదంలోకి వచ్చింది. సీఎం కేసీఆర్‌కు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు లేఖ రాశారు. టీడీపీ కార్యాలయ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ భవన్‌కు ఇచ్చిన లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని లేఖలో కేసీఆర్‌కు విన్నవించారు. ట్రస్టు పేరుతో టీడీపీ 30 ఏళ్లు లీజుకు తీసుకున్న ప్రభుత్వ స్థలాన్ని ట్రస్టుకు కాకుండా వ్యాపార కార్యకలాపాలను వినియోగిస్తోందని..ట్రస్టు భవన్ లో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు ప్రభుత్వం ఇచ్చిన లీజును రద్దు చేయాలని..స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌లో ఆంధ్రావారి పెత్త‌నం ఎక్కువ‌య్యింద‌ని... తెలంగాణ ఉద్యోగుల‌ను వేధిస్తున్నార‌ని సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులు లేఖ రాశారు. ట్ర‌స్ట్‌లో ఎల్ ర‌మ‌ణ మాటకు విలువ లేకుండా పోతుందని లేఖలో తెలిపారు.

ntr trust bhavan employees written letter to cm kcr. for trust land issue.

ఈ విష‌యంలో ప్ర‌భుత్వ పెద్ద‌లే తెర వెనుక ఉండి త‌తంగాన్ని న‌డిపిస్తున్నారా...? లేదంటే లేఖలో రాజ‌కీయ కోణాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేఖ వచ్చినందున చర్యలు ఉండే అవకాశం ఉంది.

టీడీపీ కమిటీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ మాటకు విలువ లేదని చెప్పడం కాస్త సందేహం కలిగిస్తోంది. అధ్యక్షుడి మాటను వినకపోవడం ఏంటీ అనే సందేహాలు వస్తున్నాయి. నిజంగా ఆంధ్ర వారి పెత్తనం ఉందా.. లేదంటే ఎల్ రమణ పార్టీ మార్పు నేపథ్యంలో జరుగుతున్న ఊహాగానాలేనా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

English summary
ntr trust bhavan employees written letter to cm kcr. for trust land issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X