Hyderabad: హైదరాబాద్ వాసులకు శుభవార్త..!
హైదరాబాద్(Hyderabad) మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. పట్నంలో ఎన్ని జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వెలిశాయి. లక్షలాది మందికి పరోక్ష, ప్రత్యేక్ష ఉపాధి లభిస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి చాలా మంది ఉపాధి కోసం హైదరాబాద్ వస్తున్నారు. దీంతో హైదరాబాద్ జనాభా భారీగా పెరుగుతోంది. జనాభాతో పాటు వాహనాలు పెరుగుతోన్నాయి. దీంతో రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
రోడ్లు విస్తరించిన ఫలితం లేకుండాపోతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా కోటీ నుంచి ఉప్పల్ దారిలో ఎప్పుడు భారీగా ట్రాఫిక్ ఉంటుంది. దీంతో ఈ మార్గంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టారు. తాజాగా అంబర్‌పేట్ ఫ్లైఓవర్ దాదాపు పూర్తి కావొచ్చిందని మరో నెల రోజుల్లో దీన్నీ ప్రారంభించే అవకాశం ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జూన్ 19, బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దీనిపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఫిబ్రవరిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కమిషనర్ రోనాల్డ్ రోస్ పురోగతిని పరిశీలించారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పనులపై, రోడ్లు దెబ్బతిన్నట్లయితే, ఆ బాధ్యత రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లపై మాత్రమే కాకుండా సంబంధిత అధికారులపై కూడా పడుతుందని మంత్రి అధికారులను హెచ్చరించారు. ఒకరిద్దరు అధికారుల వల్ల ప్రజల జీవితాలు దెబ్బతింటే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ రహదారుల పనుల వేగాన్ని పెంచాలని, రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)లను కలిపే లింక్ రోడ్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై వివిధ బ్లాక్‌స్పాట్‌ల వద్ద మరమ్మతు పనులు చేపడుతున్నామని, త్వరలో హైవేను గ్రీన్‌ఫీల్డ్ హైవేగా మారుస్తామని చెప్పారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఈ సమస్యను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
పనుల్లో నిమగ్నమైన కాంట్రాక్టర్‌ను మార్చాలని లేదా పనులు వేగవంతం చేసి పూర్తి చేసేందుకు గడువు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు 4.4 కి.మీ 6-లేన్ హైవే విస్తరణ పనులు 82% పూర్తయ్యాయని, చివరి కిలోమీటరు వరకు అటవీ శాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు ఆయనకు వివరించారు. ఒకట్రెండు రోజుల్లో అటవీశాఖ అధికారులతో సమావేశమై ఆయా అంశాలపై చర్చిస్తానని మంత్రి వారికి చెప్పారు. కరీంనగర్, సిద్దిపేట వెళ్లే ప్రజలు కూడా తీవ్ర ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు. ఆ రూట్ లో కూడా ఫ్లై ఓవర్లు నిర్మించాలని డిమాండ్ ఉంది.












Click it and Unblock the Notifications