షాకింగ్: పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద మళ్లీ మంటలు -వారంలో రెండో అగ్ని ప్రమాదం -జనం పరేషాన్

జంట నగరాల్లోనే అత్యంత రద్దీగా ఉండే పంజాగుట్ట ప్రాంతంలో మరోసారి భయాందోళనలు చెలరేగాయి. ట్రాఫిక్ పరంగా కీలకమైన పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై నుంచి మంటలు ఎగసిపడుతూ భీతావాహ దృశ్యాలు కనిపించాయి. గడిచిన వారం రోజుల్లో అదే ఫ్లై ఓవర్ వద్ద మంటలు ఎగిసిపడటం ఇది రెండో సారి.

ఫ్లైఓవర్ మీదుగా మంటలు, పొగలు వ్యాపించడంతో ఆ సమయంలో అక్కడున్న వాహనదారులు, దుకాణదారులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది.. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు.

once again fire breaks at under panjagutta flyover in hyderabad, second incident in a week

ప్రమాదం నేపథ్యంలో పంజాగుట్ట మార్గంలో పోలీసులు వాహనాల రాకపోకలను కాసేపు నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణ స్థాయికి చేరింది. గత శుక్రవారం(మార్చి 12)న కూడా సరిగ్గా ఇలాగే, దాదాపు మధ్యాహ్నం సమయంలోనే పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద అగ్నప్రమాదం సంభవించింది. కాగ,

మొన్నటి ఘటనలో ఫ్లై ఓవ‌ర్ కింద ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌లో మంట‌లు చెల‌రేగడంతో మంటలు వ్యాపించినట్లు వెల్లడికాగా, తాజా ప్ర‌మాదం కూడా షార్ట్ సర్క్యూట్ కార‌ణంగా జ‌రిగిందా? లేక ఎవ‌రైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్ లో ఎండలు దంచుతుండటంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+