హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెప్ట్ సేవలకు అంతరాయం: ఆదివారం కొన్ని గంటలు బంద్.. మళ్లీ ఎప్పుడూ అంటే..

|
Google Oneindia TeluguNews

ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించేందుకు ఉపయోగించే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ ఆధునికీకరించబోతున్నారు. టెక్నికల్ అప్‌గ్రెడేషన్ కోసం ఆదివారం 14 గంటలపాటు నెప్ట్ సేవలు నిలిచిపోబోతున్నాయి. మే 22 రాత్రి 00:01 గంటల నుంచి మే 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. ఈ మేరకు ఆర్బీఐ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

నెప్ట్ సేవలను వినియోగించుకునే బ్యాంకులు తమ కస్టమర్లకు వివరాలను తెలియజేయాలని ఆర్బీఐ తెలిపింది. కస్టమర్లు తమ లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఓ ప్రణాళికను రూపొందించుకునేందుకు వీలుగా సమాచారాన్ని అందించాలని పేర్కొంది. నెప్ట్ మెంబర్ బ్యాంకులకు నెప్ట్ సిస్టమ్ బ్రాడ్‌కాస్ట్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయనున్నట్లు వివరించింది.

online money transfer facility neft will not be available on sunday

Recommended Video

Cyclone Yaas: Andhra Pradesh ముంచుకొస్తున్న తుపాను | Odisha, WB Alert || Oneindia Telugu

రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సదుపాయం ఈ సమయంలో యథావిథిగానే కొనసాగుతుందని ఆర్బీఐ పేర్కొంది. దీనిని ఏప్రిల్ 18న అప్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ నెప్ట్ సేవలు మాత్రం నిలిచిపోతాయి. ఆర్టీజీఎస్ మాత్రం పనిచేయడంతో ఊపిరి పీల్చుకోనున్నారు. అదీ కూడా ఆదివారం కావడంతో రెగ్యులర్ ట్రాన్సాక్షన్ ఉండే అవకాశం లేదు. ఇంపార్టెంట్ అయితే మాత్రం ఆర్టీజీఎస్ మాత్రం యూజ్ అవుతాయి.

English summary
online money transfer facility neft will not be available on sunday for 14 hours due to technical reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X