విశ్వనగరానికి మణిహారం ఓఆర్ఆర్ - హాట్ స్పాట్, వడివడిగా..!!

విశ్వనగరం వేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ నగరానికి మణిహారంగా మారుతోంది. 158 కిలో మీటర్ల మేర ఉన్న ఓఆర్ఆర్ అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తోంది. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాప్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి కంపెనీలే ఔటర్‌ రింగు రోడ్డు బయట భారీ ఎత్తున డేటా సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాయి. ఏయిర్ పోర్టు కనెక్టివిటీ అందుబాటులో ఉండటంతో పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలంగా మారుతోంది.

అభివృద్ధికి చిరునామాగా:గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధికి చిరునామాగా మారుతోంది. నగరం నలుమూలలా వేగంగా అభివృద్ధి విస్తరిస్తోంది. ఈ ప్రాంతం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ కు అనుకూల ప్రాంతంగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు రియల్ వ్యాపారంతో పాటుగా పలు రంగాల పెట్టుబడులకు ఈ ప్రాంతం అనుకూలంగా మారుతోంది. ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, మెడికల్‌ డివైజెస్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహన రంగాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు ఔటర్‌ చుట్టూ ఏర్పాటవుతుండడంతో ఔటర్‌ రింగు రోడ్డు సరికొత్త హాట్‌స్పాట్‌గా మారుతోంది. నగర శివారులో ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు ఐటీ రంగం అభివృద్ధితో ఐటీ కారిడార్‌లో భాగంగా మారిపోయింది.

Opinion: Hyderabad City competing with international cities under KCR govt, deets here

మౌళిక వసతులకు ప్రాధాన్యత:ఓఆర్‌ఆర్‌ నుంచి అత్యంత మెరుగైన రోడ్ల అనుసంధానం కోర్‌ సిటీకి ఉండడంతో శివారు ప్రాంతాల్లోనూ కొత్తగా తమ ప్రాజెక్టులను చేపట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. విదేశీ రియల్టీ సంస్థలు సైతం ఇక్కడ భారీ ఎత్తయిన ఆకాశహర్మ్యాలను 10 నుంచి 59 అంతస్థుల దాకా నిర్మిస్తున్నాయి. నగరంలో ప్రజా రవాణాకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. కీలకంగా ఉన్న మెట్రో రైలు సౌకర్యాన్ని సైతం ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం మెట్రోస్టేషన్‌ నుంచి ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌కు 4 చోట్ల రైల్వే మార్గాలు అనుసంధానమై ఉండగా, వాటికి సమీపంలోనే కొత్తగా శాటిలైట్‌ రైల్వే స్టేషన్‌ను నిర్మించాలన్న ప్రతిపాదనను రూపొందించారు. కోర్‌ సిటీ నుంచి ఔటర్‌ వరకు 33 రేడియల్‌ రోడ్డు నిర్మిస్తూ శివారు ప్రాంతాలకు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థలను సైతం విస్తరిస్తున్నారు.

పారిశ్రామిక వాడల ఏర్పాటు:మంచినీటి సరఫరా కోసం గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చే పైపులైను మార్గాలను కలుపుతూ ఓఆర్‌ఆర్‌ చుట్టూ రింగు మెయిన్‌ పేరుతో భారీ పైపు లైను నిర్మాణం చేపట్టారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ మొదట 22 ఇంటర్‌చేంజ్‌లతో నిర్మిస్తే, తర్వాతి కాలంలో జరుగుతున్న అభివృద్ధిని, అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరో 3 చోట్ల( నార్సింగి, కోకాపేట, మల్లంపేట) కొత్తగా ఇంటర్‌చేంజ్‌లను నిర్మిస్తున్నారు. మహేశ్వరం, తుక్కుగూడ, కొంగర కలాన్‌ ప్రాంతాల్లో ఫ్యాబ్‌ సిటీ, ఈ-సిటీ వంటివి రాగా, ముచ్చర్ల సమీపంలో దేశంలోని అతి పెద్దదైన ఫార్మాసిటీ నిర్మాణం పురోగతిలో ఉంది. రెండు పారిశ్రామిక వాడలు కొత్తగా ఏర్పాటయ్యాయి. అదేవిధంగా పటాన్‌చెరువు- మేడ్చల్‌ల మధ్య సుల్తాన్‌ పూర్‌ వద్ద మెడికల్‌ డివైజెస్‌ పార్కు ఏర్పాటైంది. ఔటర్‌పై ప్రమాదాల నివారణే ఏకైక లక్ష్యంగా ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ రోడ్డు మార్గాలను తీర్చిదిద్దుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+