మరక మంచిది కాదు.!టిఆర్ఎస్ దీక్ష ప్రాంగణాన్ని క్రిమిసంహారక మందుతో శుధ్ది చేసిన ఓయూ జెఏసి.!
హైదరాబాద్ : టిఆర్ఎస్ పార్టీ నేతల ధర్నా కారణంగా ఇందిరాపార్క్ లోని ధర్నాచౌక్ ప్రాంతం అపవిత్రమైందని ఓయూ జేఏసీ నేతలు మండిపడ్డారు. దీక్షా ప్రాంగణానికి పట్టిన గులాబీ చీడ పురుగులను సంహరించేందుకు క్రిమి సంహారక మందు చల్లి ధర్నాఛౌక్ ను శుక్రవారం సాయంత్రం ఊడ్చి శుభ్రం చేసారు ఓయూ జేఏసీ నేతలతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్. ఇదే కార్యక్రమంలో ఇతర కాంగ్రెస్ మరియు ఓయూ జెఏసి నిరుద్యోగ జెఏసి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారంలో ఉండి బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు యాసంగిలో వరి పంట వేయవద్దని రైతుల్ని బెదిరించి ఇరు పార్టీలు రైతులతో దొంగనాటకాలు ఆడుతున్నాయని మానవతా రాయ్ ఘాటుగా స్పందిచారు.

Recommended Video
రైతులు చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు భయపడటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రైతులకి దగ్గరవుతుందోనన్న దిగులుతో రెండు పార్టీలు కాంగ్రెస్ ప్రజా రైతు ఉద్యమాలను కబ్జా చేసాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారం లో ఉండి తమ పరువు తామే తీసుకున్నారని మానవతా రాయ్ ఎద్దేవా చేసారు. టిఆర్ఎస్ పార్టీ నిషేదించిన ధర్నాచౌక్ లోనే ధర్నాలకి దిగి పూర్తిగా దిగజారిపోయిందని రాయ్ మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో పిసిసి సంయుక్త కార్యదర్శి బాస వేణుగోపాల్ యాదవ్, కె ప్రశాంత్ రెడ్డి, ఓయూ జెఏసి ఛైర్మన్ కొప్పుల ప్రతాపరెడ్డి, నిరుద్యోగ జెఏసి నేతలు బిక్షునాయక్, అనీల్ కామ్డే తదితరులు పాల్హొన్నారు. భవిష్యత్ లో అధికార పార్టీ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే ఇదే మాదిరిగా శుద్ది చేస్తామని, ఇందిరా పార్క్ పరిసరాల్లో నిరసనలు చేసుకునే హక్కు గులాబీ పార్టీ కోల్పోయిందని మానవతా రాయ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications