వీడియో: కారు ఢీ కొట్టిన వేగానికి గింగిరాలు తిరిగిన ఆటో: ప్రయాణికుడి దుర్మరణం

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పీకల్దాకా మద్యాన్ని సేవించి, నిర్లక్ష్యంగా కారును నడిపించిన మందుబాబులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మద్యం మత్తులో కారును మితిమీరిన వేగంతో నడిపారు. రోడ్డుపై వెళ్తోన్న ఓ ఆటోను వెనుక వైపు నుంచి వేగంగా ఢీ కొట్టారు. ఈ ఘటన ఆటోలో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. ఆటోడ్రైవర్‌ గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆటోడ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.

ఈ తెల్లవారు జామున మాదాపూర్ సమీపంలోని ఇనార్బిట్ మాల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఒకవంక భారీ వర్షం పడి రోడ్ల మీద నీళ్లు నిల్చున్నప్పటికీ.. లెక్క చేయక కారును శరవేగంతో నడిపించారా మందుబాబులు. ఈ ఘటనలో మృతుడిని ఉమేష్ కుమార్‌గా గుర్తించారు. ఉమేష్ గచ్చీబౌలిలోని ప్రిజమ్ క్లబ్‌లో ఉద్యోగి. విధులను ముగించుకుని ఆటోలో ఇంటికి బయలుదేరాడు. ఆటో ఇనార్బిట్ మాల్ సమీపంలో వెళ్తోన్న సమయంలో వెనుక వైపు వేగంగా వచ్చిన ఆడి కారు దాన్ని ఢీ కొట్టింది.

ఆ కారు ఆటోను ఎంత వేగంగా ఢీ కొట్టిందంటే- ఆటో గింగిరాలు తిరుగుతూ కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరి పడింది. అందులో ప్రయాణిస్తోన్న ఉమేష్ సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సైబరాబాద్ పోలీసులు నిందితులను గుర్తించారు. సుజిత్ రెడ్డి, ఆశిష్‌ కారులో ఉన్నట్లు మాదాపూర్ పోలీసులు నిర్ధారించారు. వారిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో సుజిత్ రెడ్డి కారును డ్రైవ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Overspeeding luxury car hits auto from behind near Inorbit Mall Hyderabad, passenger dies

కాగా- మృతుడు ఉమేష్ ఇదివరకు బాటిల్ అండ్ చిమ్నీలో పనిచేసినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రిజమ్ పబ్ చేరాడు. ప్రిజమ్ పబ్ యాజమాన్యాన్ని వన్ ఇండియా సంప్రదించింది. ఉమేష్ మృతి పట్ల యజమాని వినయ్‌గౌడ్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉమేష్ కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. ప్రతినెలా కొంత మొత్తం అతని కుటుంబానికి చెందేలా బ్యాంకులో నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని భావిస్తున్నట్లు వినయ్ గౌడ్ చెప్పారు. ఉమేష్ కుటుంబం అతని సంపాదన మీదే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఇక యాజమాన్యంతో పాటు ఉద్యోగి ఉమేష్ సన్నిహితులు కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఉమేష్ కుటుంబాన్ని ఈ కష్ట సమయంలో ఆదుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+