పెండింగ్ చలాన్లు.. ఆన్ లైన్ ద్వారా చేయొచ్చు.. ఫోన్ పే, జీ పే, పేటీఎంతో కట్టొచ్చు
వాహనదారులకు తెలంగాణ ఆర్టీఏ గుడ్ న్యూస్ తెలిపిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి చలాన్‌లో రిబేట్ లభించనుంది. 25శాతం చలానా కడితే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా పెండింగ్ చలానా చెల్లించాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ-చలాన్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్లు చెల్లించొచ్చు అని ఆయన తెలిపారు.

పోన్ పే, జీ పే కూడా..
పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు అని సూచించారు. లేదంటే మీ సేవ, ఈ సేవలో కూడా చెల్లించొచ్చని పేర్కొన్నారు. రేపటినుంచి మార్చి 30వ తేదీ వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీ అమల్లో ఉంటుందన్నారు. ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై 75 శాతం మాఫీ చేయగా.. 25 శాతం చెల్లిస్తే సరిపోతుంది.

బస్సులకు ఇంత
అయితే ఆర్టీసీ బస్‌లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50 శాతం, తోపుడు బండ్లకు 75 శాతం, నో మాస్క్ కేసుల్లో రూ.900 వరకు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. గత రెండు సంవత్సరాలు కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది.

రేపటినుంచే
ఇటు ట్రాఫిక్ చలానాలు పెండింగ్ ఉన్న వాహనదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెండింగ్ చలానాలా ఈ లోక్ అదాలత్ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఈలోక్ అదాలత్‌కు అనుగుణంగా అధికారులు ఈ చలానా పోర్టల్‌లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తున్నారు. గత నాలుగేళ్లలో 6.19 కోట్ల మేర వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వసూల్ అయ్యాయి. మిగతా జరిమానాల కోసం పోలీసు శాఖ ఇప్పుడు రాయితీలు ప్రకటించింది. టూ వీలర్స్ 75 శాతం రాయితీతో ఈ-లోక్ అదాలత్‌లో చలానాలను క్లియర్ చేసుకోనుంది. అంటే ద్విచక్ర వాహనంపై రూ.1000 జరిమానా పెండింగ్‌లో ఉంటే రాయితీ పోగా రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి రూ.35 సర్వీస్ చార్జీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ వెబ్ సైట్
వాహనదారులు ఎలాంటి పడిగాపులు, క్యూలైన్లు, అవసరం లేకుండా తమ జరిమానాలను ఈ-చలానాల వెబ్‌సైట్ https://echallan.tspolice.gov.in/publicviewలో పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా పోలీసు శాఖ పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తోంది. ఈ అప్ డేట్ సాఫ్ట్ వేర్ మార్చి1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులోకి ఉంటుంది.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications