కొండంత పెంచి.. పిసరంత తగ్గించారు..పెట్రో ధరలపై కేసీఆర్ విసుర్లు
సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్నారు. పెట్రో, డీజిల్ ధర గురించి కూడా మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం చెప్పేవి అబద్ధాలేనని వివరించారు. ఇందుకు సంబంధించి ఆధారాలతో సహా సీఎం కేసీఆర్ నిరూపించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఉన్న అపోహలను తెలంగాణ ప్రజానికానికి తెలియజేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్‌లో 105.52 డాలర్లుగా ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లుగా ఉందని చెప్పారు.
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ ధర 105 డాలర్లు దాటలేదని వివరించారు. ఆయిల్ ధర క్రాష్ అయి చాలా సార్లు తగ్గాయి కానీ.. ఏనాడూ పెరగలేదని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని కేంద్రం అబద్ధం చెప్పి ధరలు పెంచుతూ పోయిందన్నారు. పెంచే పద్ధతి కూడా అడ్డదిడ్డంగా ఉందన్నారు. సుంకం పెంచకుండా సెస్ రూపంలోకి మార్చి ధరలు పెంచారని వివరించారు. రాష్ట్రాల వాట ఎగ్గొడుతూ.. రాష్ట్రాల నోరుకొడుతున్నారని ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని సెస్ కింద మార్చి లక్షల కోట్లు ఎగ్గొడుతున్నారని పేర్కొన్నారు. 2014 లో 77 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే ఇప్పుడు రూ.114 చేశారు. డీజిల్ ధర 68 రూపాయలు ఉంటే రూ. 107.40 చేశారని వివరించారు. కొండంత పెంచి.. పిసరంత ధరను తగ్గించి ఏదో గొప్ప పని చేసినట్లు చెప్పుకుంటోందని మండిపడ్డారు. ధరలు రాష్ట్రాలు కూడా తగ్గించాలని మాట్లాడుతున్నారని.. ముందు సెస్ విత్‌డ్రా చేసుకోవాలని కోరారు. 2014 రేట్‌కే ఇప్పుడు పెట్రోల్ ఇవ్వొచ్చు.. అని కేసీఆర్ డిమాండ్ చేశారు.
Recommended Video
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోయింది తప్పితే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యాట్ పెంచలేదు. ఇప్పటి వరకు పైసా కూడా తీసుకోలేదని వివరించారు. కేంద్రం పెంచింది కానీ.. రాష్ట్రం ఏనాడూ పెంచలేదు. ఏ నైతికతతో మీరు మాట్లాడుతున్నారని అడిగారు. అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications