ఓటర్ స్లిప్పులతో ఓటెయ్యరాదు..! ఐడీ ప్రూఫ్స్ కావాల్సిందే..!

Recommended Video

    Telangana Election 2019 : ఓటర్ స్లిప్పులతో ఓటెయ్యరాదు..!

    హైదరాబాద్ : ఫోటో ఓటర్ స్లిప్పులు ఉన్నంత మాత్రాన ఓటు వేయడానికి వీలు లేదంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లు తమ వెంట ఫోటో గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని సూచించారు.

    ఎన్నికల సంఘం పంపిణీ చేస్తున్న ఓటర్ స్లిప్పులను గుర్తింపు కార్డులుగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు (EPIC) తీసుకురావాలని కోరారు. అది లేని పక్షంలో మరో 11 రకాల కార్డుల్లో ఏది వెంట తెచ్చుకున్నా.. ఓటు వేయడానికి వీలవుతుందని తెలిపారు. అయితే ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా మాత్రం ఓటు వేయడానికి ఛాన్స్ ఉండదన్నారు.

    photo voter slips not valid for voting id proof must

    పోలింగ్ కేంద్రం దగ్గర అనుమతించే ఫోటో ఐడెంటిటీ కార్డులు ఇవే :

    1) పాస్‌పోర్ట్
    2) డ్రైవింగ్ లైసెన్స్
    3) పాన్‌ కార్డు
    4) ఆధార్ కార్డు
    5) బ్యాంకులు, పోస్టాఫీసులు ఇష్యూ చేసే పాస్ బుక్కులు (ఫోటో ఉండాలి)
    6) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు / ప్రభుత్వరంగ సంస్థలు / పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు
    జారీచేసిన ఉద్యోగుల ఫోటో గుర్తింపు కార్డు
    7) పింఛన్ పత్రాలు (ఫోటో ఉండాలి)
    8) ఎంపీ / ఎమ్మెల్యే / ఎమ్మెల్సీలు తమ సంతకాలతో జారీచేసిన గుర్తింపు పత్రం
    9) ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్
    10) ఉపాధిహామీ పత్రం
    11) ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్‌ కార్డు

    పై వాటిలో కచ్చితంగా ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఓటర్లు తమ వెంట పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి. ఫోటో గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు వేయనిస్తారు. లేదంటే ఓటు వేయడానికి అధికారులు ఒప్పుకోరు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+