దమ్ముంటే పాతబస్తీకి రావాలంటూ ప్రధానికి ఓవైసీ సవాల్: 28న హైదరాబాద్‌కు నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 28న హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను ప్రధాని మోడీ పరిశీలిస్తారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పరిశీలిస్తారు.
Recommended Video

28న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ..
భారత్ బయోటెక్‍లో వ్యాక్సిన్ కోవాగ్జిన్ పురోగతిని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత ప్రధాని మోడీ పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ అభివృద్ధి వివరాలను, తాజా పరిస్థితిపై మోడీ సమీక్షించనున్నారు.

గ్రేటర్ ఎన్నికల వేళ నగరానికి ప్రధాని మోడీ..
కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం పీక్ దశలో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీపై జేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్, ఎంఐఎం కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన జరగడం హాట్ టాపిక్‌గా మారింది.

గ్రేటర్ ఎన్నిగ్రేటర్ ప్రచారానికి బీజేపీ బడా నేతలు..
గ్రేటర్ బీజేపీ మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ 27న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన నవంబర్ 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనుండగా,డిసెంబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
ల వేళ నగరానికి ప్రధాని మోడీ..

ప్రధాని మోడీకి అసదుద్దీన్ ఓవైసీ సవాల్..
ఇది ఇలావుంటే, ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ పాతబస్తీలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలంటూ ప్రధాని మోడీకి ఓవైసీ సవాల్ చేశారు. ప్రధాని మోడీ ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తే ఎన్ని సీట్లు గెల్చుకుంటారో చూద్దామని అన్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ బడా నేతలు ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో వారంతా ఎందుకు ఏకంగా ప్రధాని మోడీతోనే ప్రచారం చేయించండి అంటూ బీజేపీకి ఓవైసీ సూచించారు.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications