Hyderabad: ఎవర్రా మీరు.. స్మశానంలో మందు తాగుతున్నారు..!
సాధారణంగా దావత్ చేసుకోవాలంటే ఇంట్లో చేసుకుంటారు. లేదంటే ఫంక్షన్ హాల్, లేదా రిసార్ట్ బుక్ చేసుకుంటారు. లేదా ప్రశాంత వాతావరణం ఉన్న చోటికి వెళ్లి మద్యం సేవిస్తారు. కానీ హైదరాబాద్ లో కొందరు స్మశాన వాటికలో మందు తాగుతున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మాదకద్రవ్యాల వినియోగం నిర్మూలించే ఉద్దేశంతో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఆగ్నేయ జోన్ టాస్క్ ఫోర్స్ చంచల్‌గూడలోని సుల్తాన్ దైరా స్మశానవాటికలో తనిఖీలు చేశారు.
స్మశానవాటికలో మద్యం తాగుతున్న, గంజాయి తీసుకుంటున్న అనేక మంది వ్యక్తులను పట్టుకున్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నిర్వహించిన ఈ ఆపరేషన్ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో కళంగ చందు అనే విద్యార్థి, మహ్మద్ సాదిక్ అనే కార్మికుడు శ్మశానవాటిక సమీపంలోని ఫుట్‌పాత్‌లో గంజాయి వినియోగిస్తుండగా పట్టుబడ్డారు.

ఎండీ హఫీజ్, ఎండీ యూసుఫ్, ఇమ్రాన్ బిన్ ఆలం ఎండీ హమీద్ మద్యం సేవించిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారిని టాస్క్‌ఫోర్స్ మాదన్నపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్‌లోని శ్మశానవాటికలో మద్యం సేవించడం, మాదక ద్రవ్యాల వినియోగంపై అణిచివేతకు చేపట్టిన ఆపరేషన్‌ను టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ కె.ఎన్. ప్రసాద్ వర్మ పాల్గొన్నారు.
కాగా.. దబీర్‌పురా రోడ్డు ఓవర్‌బ్రిడ్జి నుంచి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలు క్రాస్‌రోడ్‌కి కలిపే ప్రైవేట్ బస్సుల్లో గంజాయి సేవించడం, మద్యం సేవించడం సర్వసాధారణంగా మారింది. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య భారీగా మత్తు పదార్థలు బయటపడుతున్నాయి. పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. నగరంలోకి మత్తు పదార్థాలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications