Tollywood: డ్రగ్స్ కేసులో నటుడు అభిషేక్ అరెస్ట్..!
తెలంగాణ డ్రగ్స్ వినియోగం పెరుగుతోన్న నేపథ్యంలో పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎంత కట్టడి చేసినా ఎదో చోట గంజాయి పట్టుబడుతోంది. డ్రగ్స్ వినియోగంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు పట్టుబడుతున్నారు. నటి హేమ బెంగళూరులో ఓ పార్టీలో పాల్గొన్నారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నారని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదని హేమ చెబుతున్నారు. తాజాగా మాదక ద్రవ్యాల కేసుల నటుడు అభిషేక్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గురువారం అభిషేక్ ను గోవాలో అరెస్ట్ చేసింది. ఆయన్ను ప్రస్తుతం హైదరాబాద్ తీసుకొస్తున్నారు. జూబ్లీహిల్స్, ఎస్సానగర్ లో నమోదైన డ్రగ్స్ కేసుల్లో అభిషేక్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అభిషేక్ బెయిల్ పై ఉన్నాడు. అతడు కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ మధ్య సినీ పరిశ్రమకు చెందిన వారు వార్తల్లో నిలుస్తున్నారు.

రాజ్ తరుణ్ పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీసుల కస్టడీలో ఉన్నారు.
గతంలో టాలీవుడ్ లలోని పలువురు ప్రముఖులపై డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వారిని విచారించారు కూడా. కానీ ఇప్పటి వరకు ఆ కేసు సంబంధించి వివరాలు బయటకు వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications