Hyderabad: 15న నరేంద్ర మోడీ పర్యటన.. అటువైపు వెళ్లొద్దు..!

భారతీయ జనతా పార్టీ (BJP)లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నగర పర్యటనను దృష్టిలో ఉంచుకుని మీర్జాల్‌గూడ నుంచి మల్కాజిగిరి ఎక్స్‌రోడ్‌ల వరకు 5 కి.మీ వ్యాసార్థంలో సర్కిల్‌తో 'నో డ్రోన్ జోన్' ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు ప్రకటించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం మోడీ ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 (1974 చట్టం II) సెక్షన్ u/s 144 ప్రకారం రిమోట్‌గా నియంత్రించబడే డ్రోన్‌లు లేదా పారా-గ్లైడర్‌లు లేదా రిమోట్‌లీ కంట్రోల్డ్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ లేదా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఉపయోగించి ఈ చర్యను అమలు చేస్తామని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.

అంతేకాకుండా, హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి 5 కిలోమీటర్ల పరిధిలో, ఏదైనా పౌర, ప్రైవేట్ లేదా రక్షణ విమానాశ్రయాల నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌ల ఎగురవేత నిషేధించారు. ప్రధాన మంత్రి మల్కాజిగిరిలో గంటన్నర పాటు రోడ్‌షోలో పాల్గొనున్నారు. రోడ్ షో మార్గంలో ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు. మార్చి 15, 16, 18 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మల్కాజిగిరితో పాటు జగిత్యాల, నాగర్​ కర్నూలు జిల్లాలో మోడీ పర్యటించనున్నారు. మార్చి 16వ తేదీన నాగర్ కర్నూలులో సభలో పాల్గొంటారు.

Police imposed traffic restrictions during Prime Minister Narendra Modi s visit

మార్చి 18న జగిత్యాలలో ప్రధాని మోడీ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.మార్చి 16న ప్రధాని నరేంద్ర మోడీ నాగర్‌​కర్నూల్ జిల్లా కేంద్రానికి రానున్నారని బీజేపీ నేత, జాతీయ బీసీ మాజీ కమిషన్ సభ్యుడు తల్లోజు వివరించారు. నాగర్ కర్నూలు నుంచి బీజేపీ తరఫున భారత్ పోటీ చేస్తున్నారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తున్నారు.

బీజేపీ తాజాగా రెండో జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి ఆరుగు పేర్లను ప్రకటించింది. మెదక్ నుంచి రఘునందన్ రావు, ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్ కు అవకాశం కల్పించింది. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైది రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. అయితే బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన 15 మందిలో.. భరత్, బీబీ పాటిల్, సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు.

తెలంగాణలో నలుగురు సిట్టింగ్ ఎంపీలకు గానూ.. ముగ్గురికి మరోసారి అవకాశం ఇచ్చిన బీజేపీ.. ఆదిలాబాద్ ఎంపీ బాపూరావుకు మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఇక జితేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశించినప్పటికీ.. ఆయనకు కూడా మొండి చేయి చూపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+