నరేష్-పవిత్ర లోకేష్ వ్యవహారంలో కీలక మలుపు
సినీ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. నరేష్ తో ముడిపెడుతూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయని, అసభ్యకరంగా ట్రోల్స్ చేస్తున్నారంటూ పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు ఛానల్స్ కు, వెబ్ సైట్లకు నోటీసులు జారీచేశారు.
ఇప్పుడు ఇదే విషయంపై నరేష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఛానళ్లతో పాటు కొంత మందిపై క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన నాంపల్లి కోర్టు.. పిటిషన్‌లో నరేష్ పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో.. సైబర్ క్రైమ్ పోలీసులు ఆ 12 మందికి మరోసారి నోటీసులు జారీ చేశారు.

ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్,లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్‌స్ప్రెషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, దాసరి విజ్ఞాన్, కృష్ణ కుమారి, మిర్రర్ టీవీలకు నోటీసులు జారీ అయ్యాయి.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పవిత్ర లోకేష్ నవంబర్ 26న ఫిర్యాదు చేశారు. ఫొటోలని మార్ఫింగ్ చేసి.. కొన్ని వెబ్ సైట్లు వైరల్ చేస్తున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రైవసీకి ఇవన్నీ భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ పలు ఆధారాలను ఫిర్యాదుకి జత చేశారు.












Click it and Unblock the Notifications