• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బస్తీ, గల్లీ 'బచ్చే గ్యాంగ్' లపై పోలీస్ నజర్.. మత్తులో రెచ్చిపోతున్న యువతకు చెక్

|

హైదరాబాద్ : కొందరు యువకులు మంచికన్నా చెడువైపే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సినిమాల ప్రభావమో లేదంటే అందివచ్చిన టెక్నాలజీ కారణమో తెలియదు గానీ మానసిక ప్రవర్తన శృతి మించుతోంది. మీసకట్టు సరిగా రాని మైనర్లు కూడా విచ్చలవిడితనానికి పరాకాష్టగా మారుతున్నారు. మత్తుకు బానిసవుతున్న యువకులు విచక్షణ లేకుండా నేరాలకు పాల్పడుతున్నారు.

తాజాగా గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీబీఆర్ మిల్స్ ఆవరణలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గంజాయి మత్తులో తూగుతూ ఓ బాలికను వివస్త్రను చేసి పైశాచికానందం పొందిన ఓ నరరూప రాక్షసుడి అరాచకం భయాందోళనలు రేకెత్తించింది. అయితే ఇలాంటి యువతకు చెక్ పెట్టేలా ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రూపొందించిన స్పెషల్ ప్రోగ్రామ్ సత్ఫలితాలను ఇస్తోందట.

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో గాలం.. లక్షల్లో వసూలు.. కటకటాల్లో నిందితులుప్రభుత్వ ఉద్యోగాల పేరుతో గాలం.. లక్షల్లో వసూలు.. కటకటాల్లో నిందితులు

వామ్మో పోకిరోళ్లు..!

వామ్మో పోకిరోళ్లు..!

బస్తీలు, గల్లీల్లో ఛోటామోటా గ్యాంగులు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వీరి ఆగడాలు శృతిమించిపోతున్నాయి. చదువులో రాణించని యువకులే ప్రధానంగా ఇలాంటి గ్యాంగుల వైపు ఆకర్షితులవుతున్నారు. చౌరస్తాలు, ఛాయ్ హోటళ్లు, కిరాణ దుకాణాలు అడ్డాగా రెచ్చిపోతున్నారు. ఇక నిర్మానుష్య ప్రాంతాలు, బస్సు స్టాపులు, పార్కుల్లో వీరి ఆగడాలకు లెక్క లేకుండా పోతోంది. మద్యం, సిగరెట్లు, గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించి విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. 10 నుంచి 15 మంది వరకు గ్యాంగుగా ఏర్పడి దారిన పోయే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థినిలు, యువతులు, మహిళలు టార్గెట్ గా వేధింపులకు పాల్పడుతున్నారు.

బస్తీ, గల్లీల రోడ్లపై ఇలాంటి గ్యాంగులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నా.. ఎవరూ కిమ్మనరు. కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లినా.. ప్రజాప్రతినిధుల అండతో కేసు నమోదు కాకుండానే బయటపడుతున్నారు. దీంతో తమకు ఏమి కాదనే ధీమాతో మరింత రెచ్చిపోతున్నారు. ఈ బచ్చే గ్యాంగుల కారణంగా బయటివారే కాదు సొంత ఇంటోళ్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీరి అరాచకాలు పీక్ స్టేజీకి వెళ్లి.. మత్తుపదార్థాలకు డబ్బులు లేక పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. తల్లి, తండ్రి, కుటుంబం అనే బంధాలను మరచి దాడులకు పాల్పడుతున్న సందర్భాలున్నాయి. కొన్ని సందర్భాల్లో డబ్బుల కోసం నేరాల బాట కూడా పడుతున్నారు.

22 ఏళ్ల పోరళ్లే..! అరాచకం

22 ఏళ్ల పోరళ్లే..! అరాచకం

బస్తీ, గల్లీ బచ్చే గ్యాంగులపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. 3 నెలల కిందట ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసుల నేతృత్వంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ రూపొందించారు. వీరు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో 22 ఏళ్ల లోపున్న విద్యార్థులు, యువకులు పట్టుబడటం గమనార్హం.

ఆయా ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం పాకులాడుతున్న ఇలాంటి గ్యాంగులు లెజెండ్, బుల్లెట్, ఈగిల్ లాంటి పేర్లు పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నాయి. తమ వాహనాలపై కూడా సదరు పేర్లతో స్టిక్కర్లు అతికించుకుని ఫ్యాషన్ గా ఫీలవుతున్నారు. అయితే పోలీసుల స్పెషల్ డ్రైవ్ లో చెడు మార్గంలో పయనిస్తున్న కొంతమందిని గుర్తించారు. వారందర్నీ పోలీసు నిఘా కిందకు తెస్తూ లంపెన్ గ్యాంగ్ గా నామకరణం చేశారు.

 బైండోవర్.. కొంత మార్పు

బైండోవర్.. కొంత మార్పు


సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లో దాదాపు 30 వరకు ఇలాంటి చోటా మోటా గ్యాంగులు తారసపడ్డాయి. మొత్తం 285 మందిని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ జోన్‌లో 114, బాలానగర్ జోన్‌లో 120, ఇతర జోన్‌లో 51 మంది పోలీసులకు చిక్కారు. వీరందర్నీ ఆయా ప్రాంతాల్లోని తహసీల్దార్ల ఎదుట హాజరుపరిచారు. ఏడాది పాటు ఎలాంటి నేరాలకు పాల్పడమని రాతపూర్వకంగా 107 సెక్షన్ కింద బైండోవర్ చేయించారు. ఒకవేళ మళ్లీ నేరాలకు పాల్పడితే తమపై చర్యలు తీసుకోవచ్చని, 50వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చని అంగీకారం పత్రం రాయించారు. ఇలా బైండోవర్ కింద బుక్కయినవారు పోలీస్ నిఘాలోకి వస్తారు. మరోసారి తప్పు చేస్తూ దొరికితే బైండోవర్ కింద అరెస్ట్ తప్పదు.

 100 కు ఫోన్ చేయండి : సైబరాబాద్ సీపీ

100 కు ఫోన్ చేయండి : సైబరాబాద్ సీపీ

285 మంది యువకులను బైండోవర్ చేసిన స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలను ఇస్తోందట. చోటామోటా గ్యాంగుల పేరిట అరాచకాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన ఈ 285 మందిలో మార్పు కనిపిస్తోందట. ఈ 30 గ్యాంగులకు సంబంధించిన ఏరియాల్లో ప్రశాంత వాతావరణం చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు.

బస్తీ, గల్లీ గ్యాంగులతో ఆయా ప్రాంతాల్లో స్థానికులకు కంటిమీద కునుకు లేని పరిస్థితి. అయితే సైబరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ తో మార్పు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల ఇలాంటి గ్యాంగులకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఇంటి పరిస్థితులు కావొచ్చు, నిరక్షరాస్యత కావొచ్చు.. యువత చెడుమార్గంలో పయనిస్తోంది. ఏది చేసినా ఫ్యాషన్ లా ఫీలవుతూ ఫోజులు కొడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి గ్యాంగుల ఆట కట్టించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని.. ఆకతాయిల సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. పోలీసుల వాట్సాప్ నెంబర్లకు గానీ, డయల్ 100 కు సమాచారం అందిస్తే చోటామోటా గ్యాంగుల భరతం పడతామంటున్నారు. వివరాలు అందించిన వారి పేర్లు బయటకురాకుండా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

English summary
Some Young men went in wrong route. They addicted for alcohol, cigarette, ganja. In that way, they gathered some persons and creating a gang. Day by day these gangs are increased in hyderabad and doing nuisance. Cyberabad police conducted special drive and taken into custody 285 young men.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X