Pragna Reddy: పుల్లారెడ్డి రాఘవ రెడ్డి కోడలు లేఖపై స్పందించిన రాష్ట్రపతి.. చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ..
పుల్లారెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి కోడలు ప్రజ్ఞా రెడ్డి వినతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ, రాష్ట్రపతి ప్రైవేట్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. పుల్లారెడ్డి కుమారుడైన జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞా రెడ్డి తనను వేధిస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. గతంలో పుల్లారెడ్డి మనుమడు ఏక్ నాథ్ రెడ్డి తనను వేధిస్తున్నారంటూ ప్రజ్ఞారెడ్డి పోలీసులను ఆశ్రయించారు.
తనను ఒక గదిలో బంధించి.. బయటికెళ్లే వీల్లేకుండా గోడను నిర్మించారని ప్రజ్ఞా పోలీసులకు తెలుపగా.. పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. తాజాగా మరోసారి వీరి వివాదం తెరపైకొచ్చింది. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీవిద్యారెడ్డిల నుంచి తనను కాపాడాలంటూ ఆ ఇంటికోడలైన ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు.













Click it and Unblock the Notifications