అవినీతి, కుటుంబ పాలన.. కేసీఆర్‌పై ప్రధాని మోడీ ఫైర్
విశాఖలో రాజకీయాలు మాట్లాడని ప్రధాని నరేంద్ర మోడీ.. హైదరాబాద్‌లో విరుచుకుపడ్డారు. అవినీతి, కుటుంబ పాలన ఎంతో కాలం ఉండదన్నారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను రోజు దూషిస్తున్నారని గుర్తుచేశారు. కానీ దానిని తాను శక్తిగా మార్చుకుంటున్నానని వివరించారు.
తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మోడీ స్పష్టంచేశారు. పేదలను దోచుకునేవారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. కేబినెట్‌లో ఎవరిని ఉంచాలో.. ఎవరిని తీసేయాలో.. మూఢనమ్మకాలు నిర్ణయిస్తున్నాయని మోడీ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు ఏకమయ్యాయి అని.. అవినీతిపరులు ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లాలని కోరారు.

22 ఏళ్లుగా ఎందరితో తిట్లు తిన్నానని మోడీ పేర్కొన్నారు. రోజు కిలోల కొద్దీ తిట్లు తింటాను.. అందుకే అలసిపోనని వివరించారు. మోడీని తిట్టేవాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చక్కగా తిట్లు వింటూ.. చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయాలని కోరారు. తెలంగాణ సర్కార్‌కు రోజూ మోడీని తిట్టేందుకే సమయం సరిపోతోందన్నారు. తెలంగాణ సమాజాన్ని తిడితే మాత్రం అంతకంతా ప్రతీకారం తప్పదని పేర్కొన్నారు.
గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేవని మోడీ గుర్తుచేశారు. కానీ ఆధార్ లింక్ చేసి అవినీతిని అడ్డుకున్నామన్నారు. రైతుల ఖాతాల్లోనే పీఎం కిసాన్ నిధులు వేస్తున్నామని తెలిపారు. దీంతో అవకతవకలకు ఆస్కారం లేకుండా పోయిందని తెలిపారు. నిధులు నేరుగా లబ్ధిదారులకే ఇస్తుండటంతో.. అవినీతిపరులకు కడుపు మండుతుందని మోడీ విమర్శించారు.












Click it and Unblock the Notifications