Sam-chay:జీజీ అంటే అదీ కాదు.. అక్క, ప్రీతమ్‌పై కామెంట్ల గురించి సాధనా

మోస్ట్ లవబుల్ కపుల్ సామ్- చై విడిపోయారనే అంశం డైజెస్ట్ కావడం లేదు. ప్రతీ ఒక్కరు వారు కలిసి ఉంటే బాగుండేది అని అంటున్నారు. అయితే సామ్.. పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్‌తో సన్నిహితంగా ఉందని.. అదీ చైకి నచ్చలేదని.. అందుకే వారు విడిపోయారనే రూమర్లు వచ్చాయి. ఏదైనా ఇష్యూ జరిగితే ఇక అంతే కదా.. అలా అక్రమ బంధం కలిపేశారు. దీనిపై పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ క్లారిటీ ఇచ్చారు.

 జీజీ అంటే

జీజీ అంటే

సమంత పర్సనల్ స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ పై నెటిజ‌న్లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. అత‌డి వ‌ల్లే స‌మంత‌-నాగ‌చైత‌న్య జంట విడిపోయింద‌ని కొంద‌రు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ప్రీతమ్ జుకాల్కర్ గ‌తంలో సామాజిక మాధ్య‌మాల్లో చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌ను చూపెడుతున్నారు.తాను స‌మంత‌తో క‌లిసి సంతోషంగా గ‌డిపాన‌ని తెలుపుతూ ఆమెను ప్రీత‌మ్ జీజీగా సంబోధిస్తూ పోస్ట్ చేశాడు.

జీజీ అంటే ఏంటో తెలియ‌క నెటిజ‌న్లు ఎన్నో అర్థాలు తీస్తున్నారు. స‌మంత‌ను ప్రీతమ్ జుకాల్కర్ అక్క అని పిలిచేవాడ‌ని సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ త‌న సామాజిక మాధ్యమ ఖాతా స్టోరీస్‌లో చెప్పారు. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని అందరూ అపార్థం చేసుకుంటున్నార‌ని అన్నారు.

అక్క

అక్క

'జీజీ' అంటే 'అక్క' అని అర్థం అని వివ‌రిస్తూ ఆమె గూగుల్ ట్రాన్స్‌లేష‌న్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశారు. త‌నకు ఈ రోజు షూట్ లేనపోవ‌డంతో.. భ‌గ‌వంతుడు నాకు తెలివిని ప్రసాదించడంతో ఈ పోస్టు చేస్తున్నాన‌ని చుర‌క‌లంటించారు. కొందరు తెలివిలేని వాళ్లకు దీన్ని షేర్ చేయాలని అకుంటున్నాన‌ని చెప్పారు. ఇక‌నైనా ప్రీతమ్ జుకాల్కర్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని స‌మంత ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

వెంకీ ఇలా

వెంకీ ఇలా

చైతు మామ, విక్టరీ వెంకటేశ్ రియాక్టయ్యారు. అయితే ఆయన ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేశారు. క్యాజువల్‌గా వెంకీ అంటేనే ఆధ్యాత్మికత.. ఆలోచించి ముందడుగు వేస్తుంటారు. దైవ భక్తి కాస్త ఎక్కువే.. ఆయన మాటలు కూడా అలానే ఉంటాయి. మనసు ఆలోచనలతో నిండి వుంటుందనీ, మనం వెళ్లే మార్గాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల‌ని ఆయ‌న ఓ కొటేషన్ చేశారు. అంత‌కుముందు కూడా మనం ఏదైనా విషయంపై మాట్లాడేముందు మొదట కాస్త మెద‌డుతో ఆలోచించాల‌ని సజెస్ట్ చేశారు. సాధార‌ణంగా వెంక‌టేశ్ రెగ్యుల‌ర్‌గా ఇటువంటి కొటేషన్లు పెడుతుంటారు. చై-సామ్ విడిపోయిన వేళ ఆయ‌న చేసిన‌ పోస్టులు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

పేరు మార్పు

పేరు మార్పు

సమంతా మరోసారి తన పేరు మార్చుకుంది. అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సమంత అక్కినేనిగా సోషల్ మీడియాలో పేరును మార్చేసుకుంది. ఆ మధ్య సమంతా ఓ బేబీ సినిమా సమయంలో బేబీ అక్కినేనిగా తన సోషల్ మీడియా ఖాతాను మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే చైతూతో విడాకుల రూమర్స్ బయటకి వచ్చిన కొత్తలో కొన్ని ఖాతాల్లో పూర్తిగా తన పేరు తొలగించి ఓన్లీ ఎస్ అనే అక్షరాన్ని మాత్రమే ప్రొఫైల్ నేమ్‌గా పెట్టుకుంది. మరికొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో జస్ట్ సమంత అనే పదాన్ని మాత్రమే ఉంచింది.

నేమ్ ఛేంజ్

నేమ్ ఛేంజ్

ఇప్పుడు మరోసారి నేమ్ ఛేంజ్ చేసింది. నిన్నటి వరకు ఉన్న ఎస్ అనే అక్షరాన్ని ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో మార్చింది. సమంత అని పేరును మార్చింది. అధికారికంగా చైతన్యతో విడాకుల అంశాన్ని ధృవీకరించిన సామ్.. ఆదివారం ఇలా పేరు మార్చేయడం కూడా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారుతుంది. నిజానికి చైతన్యతో పెళ్ళికి ముందు సమంత సోషల్ మీడియా ఖాతాలకు సమంత రుతు ప్రభు అనే పేరు ఉండేది. తర్వాత సమంత అక్కినేని, డైవర్స్ రూమర్స్ సమయంలో ఎస్, ఇప్పుడు మళ్ళీ సమంతకి ఫిక్స్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+