హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.20 లక్షలు కట్టండి అంతే.. ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది జులుం.. దాడి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కూడా అదే రేంజ్‌లో ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాల కారణంగా కరోనా బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకే పరుగులు తీయాల్సిన పరిస్దితి ఏర్పడింది. డిమాండ్‌ పెరగడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారిపోతోంది. కరోనా వైరస్ సొమ్ము చేసుకునే క్రమంలో రోగులను నరకయాతన పెడుతున్నాయి.

హైదరాబాద్‌లో విరించి ఆస్పత్రిలో ఓ కరోనా రోగికి ఆస్పత్రి యాజమాన్యం రూ.20 లక్షల బిల్లు వేసింది. ఆ బాధితుడిని మాత్రం కాపాడలేకపోయింది. దాంతో ఆస్పత్రి యాజమాన్యానికి మృతుని బంధువుల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పటివరకూ ఆ కుటుంబం సుమారు రూ. 11 లక్షల వరకు చెల్లించగా, మిగతా సొమ్మును కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్‌ చేస్తోంది.

private hospital charges fee.. victims family attacked

Recommended Video

Sonu Sood To Set Up Oxygen Plants In Kurnool, Nellore Hospitals || Oneindia Telugu

మృతుని బంధులు ఆస్పత్రిపై దాడికి యత్నించారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్‌, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఆ బాధిత కుటుంబానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

English summary
private hospital charge fees. victims family attacked staff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X