ప్రైవేట్ ట్రావెల్స్ స్పీడ్ లిమిట్ పాటించాల్సిందే.. డీటీసీ
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఘటనపై వివరాలను సేకరించామని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. మిగతా వారు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
బస్సులోని డీజిల్ ట్యాంకులో మంటలు అంటుకోవడంతో ఇంతటి దారుణం జరిగిందన్నారు. ట్రావెల్ బస్సుకు ఎదురుగా వస్తున్న టెంపోను తప్పించబోయి.. బ్రిడ్జి పక్కన ఉన్న లోయలోకి బస్సు పడింది. ఆ తర్వాత బస్సు ఫైర్ అయింది. ట్రావెల్ బస్సుకు రెండు డోర్స్ ఉండటం వల్ల చాలామంది ప్రమాదం నుంచి బయటపడ్డారు.

కర్ణాటక అధికారులతో ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించామని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు స్పీడ్ లిమిట్ కచ్చితంగా పాటించాలని స్పష్టంచేశారు. చనిపోయిన వాళ్లంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. అర్జున్ కుమార్ (37), అతడి భార్య (32), బివాన్ (4), దీక్షిత్ (9), అనితా రాజు (40), శివ కుమార్ (35), రవళి (30) చనిపోయారు.
రెండు కుటుంబాలకు చెందిన 32 మంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని గోవా విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గోవా నుంచి హైదరాబాద్ వస్తుండగా కలబురిగి జిల్లా కమలాపురలో ఓ మినీ లారీని ఢీకొట్టిన బస్సు.. కల్వర్టులో పడిపోయింది. క్షణాల్లో బస్సుకు మంటలు అవటుకుని తీవ్రరూపం దాల్చాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, సహాయకుడు సహా 35 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు బయటకు దూకేశారు. గాయపడిన మరో 12 మందిని స్థానికులు కలబురిగి ఏరియా ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications