Priyanka reddy murder:ప్రియాంక హత్యపై రాహుల్ షాక్, మహిళలను చిన్నచూపు చూడొద్దన్న సద్గురు
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రియాంక ఘటనను చూసి షాక్‌నకు గురయ్యానని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. ప్రియాంకరెడ్డి హత్యను యావత్ జాతి ముక్తకంఠంతో ఖండిస్తోంది.

రాహుల్ దిగ్బ్రాంతి..
ప్రియాంకను దుండగలు అటకాయించి దారుణంగా హతమార్చారని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఓ మహిళ పట్ల భయంకరంగా ప్రవర్తించారని తెలిసి ఆందోళనకు గురయ్యానని పేర్కొన్నారు. దుండగులు ప్రవర్తించిన తీరు ఊహకు అందడం లేదని తెలిపారు. ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులకు రాహుల్‌గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

సద్దురు కూడా
రాహుల్‌గాంధీతోపాటు ఆధ్యాత్మిక వేత్త సద్గురు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహిళలపై వేధింపులకు ఇదీ పరాకాష్టం చేరిందని పేర్కొన్నారు. ఆ నీచులకు చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యాయస్థానంలో శిక్ష పడుతుందని చెప్పారు. సమాజంలో కూడా మహిళలపై వైఖరి మార్చుకోవాలని సూచించారు.

లైంగికదాడి..
బుధవారం రాత్రి ప్రియాంకరెడ్డిని మహ్మద్ పాషా అండ్ కో లైంగికదాడికి తెగబడ్డారు. తర్వాత ఊపిరాడకుండా చేసి హతమార్చారు. తప్పించుకునేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టడంతో.. ప్రియాంక ఆనవాళ్లను కుటుంబసభ్యులు గుర్తించారు. ప్రియాంక హత్యపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిందితులను ఉరితీయాలని డిమాండ్ వినిపిస్తోంది.

ప్రణాళిక ప్రకారం హత్య..
ఎప్పటిలాగే బుధవారం కూడా ప్రియాంక రెడ్డి టోల్ ప్లాజా వద్దకొచ్చారు. అక్కడ బండి పార్క్ చేసి క్యాబ్‌లో వెళ్లారు. కానీ అప్పటికే అక్కడ కీచకులు తిష్ట వేశారు. మహ్మద్ పాషా అండ్ కో.. ప్రియాంక రావడం వెళ్లడం గమనించారు. బండి పెట్టడం వల్ల.. ఆమె తిరిగొస్తుందని అనుకొన్నారు. అటు, ఇటు చూసి బండి పంక్చర్ చేశాడు. మాదాపూర్‌లో ట్రీట్‌మెంట్ చేయించుకొని తిరిగొచ్చిన ప్రియాంక.. వెనక టైర్ పంక్చరవడం చూసి షాక్ తిన్నారు. సాయం చేస్తామని.. లైంగికదాడికి తెగబడ్డారు. ఊపిరాడకుండా చేసి హతమార్చారు.












Click it and Unblock the Notifications