అమీర్ పేటలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు .. విదేశీ వనితలతో వ్యభిచారం
భాగ్యనగరి కేంద్రంగా హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బ్యూటీపార్లర్లు, స్పా ల లోనే కాదు హోటళ్ళు, లాడ్జీలలో కూడా వ్యభిచార దందా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా అమీర్ పేట ప్రాంతంలోని స్టార్ హోటళ్లలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు .

అమీర్ పేట కేంద్రంగా హైటెక్ వ్యభిచారం.. 11 మంది అరెస్ట్
హైదరాబాద్ లోని అమీర్ పేట ప్రాంతంలోని స్టార్ హోటళ్లలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు, దాడులు చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు విదేశీ యువతులు ఉన్నారు . వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విదేశీ యువతులు నలుగురు ఉజ్బెగిస్థాన్‌కు చెందిన వారని తెలిపారు.

విదేశీ వనితలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా
ఆదిత్య పార్క్ హోటల్ లో హైటెక్ వ్యభిచార దందా జరుగుతోందన్న సమాచారం మేరకు రైడ్ చేసిన పోలీసులు ఈ సెక్స్ రాకెట్ ను పట్టుకున్నారు . ఎస్సార్ నగర్ పోలీసులు చేసిన ఈ దాడుల్లో హోటల్ ను నిర్వహిస్తున్న ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. ఇదే సమయంలో పంజాగుట్టలోని పోలో లాడ్జిపైనా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ఉజ్బెకిస్థాన్ కు చెందిన నలుగురు యువతులు, బెంగాల్ కు చెందిన యువతి, నలుగురు విటులు పట్టుబడ్డారు.

సెక్స్ రాకెట్ నిర్వాహకుల పరారీ ... పోలీసుల గాలింపు
పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో కొందరు నిర్వాహకులు పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ సెక్స్ రాకెట్ ను రాహుల్, సూర్య అనే ఇద్దరు వ్యక్తులు ఈ దందా నిర్వహిస్తున్నారని, వారి కోసం గాలిస్తున్నామని అన్నారు.ఈ సెక్స్ రాకెట్ వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న వెల్లడించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications